Begin typing your search above and press return to search.

దిల్ రాజు డ్రీమ్స్: కొత్త టాలెంట్‌కు గోల్డెన్ ఛాన్స్!

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త టాలెంట్‌కు అవకాశం రావడం ఎంత కష్టం అన్న విషయం చెప్పనక్కర్లేదు.

By:  Tupaki Desk   |   20 May 2025 5:42 PM
దిల్ రాజు డ్రీమ్స్: కొత్త టాలెంట్‌కు గోల్డెన్ ఛాన్స్!
X

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త టాలెంట్‌కు అవకాశం రావడం ఎంత కష్టం అన్న విషయం చెప్పనక్కర్లేదు. చాన్స్ కోసం ఎదురుచూస్తున్న వందల్లో ఉన్నా, అవకాశం దక్కేది కేవలం ఒక్కరికే. కానీ ఈ విరామాన్ని తగ్గించేందుకు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేసిన ప్రయత్నం ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన ప్రారంభించిన ‘దిల్ రాజు డ్రీమ్స్’ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ కొత్త కంటెంట్ క్రియేటర్లకు, రచయితలకు, టెక్నీషియన్లకు గొప్ప అవకాశాల తలుపులు తెరిచేలా కనిపిస్తోంది.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శకులు వంశీ పైడిపల్లి, సుకుమార్, శ్రీకాంత్ అడ్డాల, బాస్కర్ లాంటి టాలెంటెడ్ దర్శకులను పరిచయం చేసి, వారితో బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసిన దిల్ రాజు, ఇప్పుడు మరికొంత మంది టాలెంటెడ్ మేకర్స్ ను వెతకడం మొదలుపెట్టారు. కానీ ఈసారి మామూలు పద్ధతిలో కాదు. నేరుగా డిజిటల్ పాస్‌వే ద్వారా. ఈ వెబ్‌పోర్టల్ ద్వారా యువ కంటెంట్ క్రియేటర్లు తమ కథలను, స్క్రిప్టులను, ఐడియాల‌ను నేరుగా పంపించవచ్చు.

అందులో బెస్ట్‌గా ఎంపికైనవారిని పరిశీలించి ఇండస్ట్రీలో చాన్స్ ఇచ్చే అవకాశాన్ని కల్పించనున్నారు. ఇది ఎలాంటి స్క్రీనింగ్ ప్రక్రియతో జరుగుతుంది అనేది ముఖ్యమైన విషయం. మొదటగా సెలెక్ట్ అయిన ఐడియాలను పరిశీలించిన తర్వాత, టాప్ ఫైనలిస్ట్‌లకు ఇండస్ట్రీలో ఉన్న ఇతర నిర్మాతలు, దర్శకులతో ముఖాముఖి చర్చించే అవకాశం ఇస్తారని సమాచారం.

ఇలా చూస్తే ‘దిల్ రాజు డ్రీమ్స్’ కేవలం ఒక పోర్టల్ మాత్రమే కాదు, టాలెంట్‌ మిడ్‌పాయింట్‌లా మారబోతోంది. ఇది తెలుగులో ఓ క్రియేటివ్ మార్కెట్‌ను ఏర్పరిచే ప్రయత్నంగా చెప్పొచ్చు. ఇటీవలే దిల్ రాజు మరో సాంకేతిక విజన్‌ను ప్రకటించారు. ‘లొర్వెన్ AI’ అనే ప్రత్యేక స్టూడియోను ప్రారంభించారు. ఇందులో ప్రీ-ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజీల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో సినిమా తీయడాన్ని మరింత వేగవంతంగా, సమర్థవంతంగా మార్చే టెక్నాలజీని అందుబాటులోకి తెస్తున్నారు.

అయితే టెక్నాలజీతో పాటు టాలెంట్‌కీ సమాన ప్రాధాన్యం ఇవ్వడం దిల్ రాజు స్పష్టంగా చూపించారు. వీటన్నిటిని పరిశీలిస్తే, దిల్ రాజు ఇప్పుడు కేవలం నిర్మాత మాత్రమే కాదు, ఒక విధంగా తెలుగుసినిమాకు మార్గదర్శకుడిగా మారుతున్నట్లు అనిపిస్తోంది. కొత్త రచయితలు, కథలు, దర్శకులు, సంగీత దర్శకులు వంటి ఎన్నో విభాగాల్లో కొత్తదనాన్ని వెతకడం ద్వారా ఆయన ఇండస్ట్రీలో క్రొత్తదనానికి దారితీయడంలో ముందుంటున్నారని చెప్పొచ్చు. ఈ ప్లాట్‌ఫామ్ అధికారికంగా జూన్‌లో లాంచ్ కానుంది. దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా నిజంగా ఎంతో మంది కలలు నెరవేరే అవకాశం ఉంది. కొత్తగా రావాలనుకునే ప్రతి ఒక్కరూ ఇదే ఛాన్స్ అంటూ సిద్ధమవుతున్నారు.