Begin typing your search above and press return to search.

రాజు గారిలా చ‌ర్చించే ద‌మ్ము మిగ‌తా వాళ్ల‌కు ఉందా?

సినిమా నిర్మాణ వ్య‌యం భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోతో సినిమా అంటే 30 కోట్లు హీరో పారితోషికంగానూ పోతుంది.

By:  Tupaki Desk   |   15 Jun 2025 4:30 PM
రాజు గారిలా చ‌ర్చించే ద‌మ్ము మిగ‌తా వాళ్ల‌కు ఉందా?
X

సినిమా నిర్మాణ వ్య‌యం భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోతో సినిమా అంటే 30 కోట్లు హీరో పారితోషికంగానూ పోతుంది. ఈ విషయంలో హీరోలంతా ఆలోచించి పారితోషికాలు తీసుకోవాలి అన్న అంశం చాలాసార్లు చ‌ర్చ‌కొచ్చింది. కొంత మంది నిర్మాత‌ల ప‌రిస్థితిని అర్దం చేసుకుని త‌క్కువ చేసుకున్న వాళ్లు ఉన్నారు. ఇదే స‌మ‌యంలో నిర్మాతలంతా హీరోల‌తో గుడ్డిగా సినిమా చేయోద్ద‌ని..క‌థాబ‌లం అర్దం చేసుకుని పెట్టిన పెట్టుబ‌డికి రిక‌వ‌రీ ఏమేర ఉంటుందో? ప్రీ బిజినెస్ ఇలా అన్ని లెక్క‌లు వేసుకుని సినిమా తీయా ల‌ని నిర్మాత దిల్ రాజు లాంటి వారు త‌మ అనుభ‌వాల‌న్ని చెప్పే ప్ర‌య‌త్నం చేసారు.

ఇదంతా పాత క‌థ‌. అయితే ఓ హీరోని క‌న్విన్స్ చేసి త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఆరోగ్య క‌ర‌మైన వాత‌వ‌ర‌ణంలో తాను సినిమా తీయ‌గ‌ల‌న‌ని దిల్ రాజు ధీమా వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. తాను ఏ హీరోతో సినిమా తీసిన ఆ హీరోని ద‌గ్గ‌ర కూర్చోబెట్టుకుని ఆ సినిమాకు సంబంధించిన బ‌డ్జెట్ విష యాలన్ని చ‌ర్చిస్తాన‌ని..దాంతో వారు కూడా క‌న్విన్స్ అవుతార‌ని..వాళ్ల‌ను ఆ ర‌కంగా ఒప్పించే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని ధైర్యంగా చెప్పారు.

లాభ న‌ష్టాల‌ను అన్నింటిని బేరీజు వేసుకునే తాను సినిమా తీస్తా న‌న్నారు. మ‌రి రాజుగారిలో హీరో ముందు కూర్చుని ధైర్యంగా చ‌ర్చించే ద‌మ్ము మిగ‌తా నిర్మాత‌ల‌కు ఉందా? రాజుగారిలా సినిమా గ‌ణాంక‌ల‌ను చెప్పి హీరోల‌ను క‌న్విన్స్ చేయ‌గ‌ల‌రా? అంటే ఆ సన్నివ‌శం ఇండ‌స్ట్రీలో మ‌రో ఇద్ద‌రు ముగ్గురు నిర్మాత‌ల వ‌ద్ద త‌ప్ప అంద‌రికీ వ‌ద్ద లేద‌నే చెప్పాలి.

సురేష్ బాబు, అల్లు అర‌వింద్ లాంటి వారు మాత్ర‌మే రాజుగారిలా డిస్క‌స్ చేయ‌గ‌ల‌రు. చాలా మంది నిర్మాత‌లు హీరోల మాట‌లు విన‌డం త‌ప్ప‌...వాళ్ల‌కు ఎదురెళ్లి మాట చెప్పే ప‌రిస్థితి ఉండ‌దు. ఇది మారి న‌ప్పుడే నిర్మాత న‌ష్టాల నుంచి బ‌య‌ట ప‌డ గ‌ల‌డు. అంత వ‌ర‌కూ హీరోల పారితోషికాలు అంత‌కంత‌కు పెరుగూత‌నే ఉంటాయి.