Begin typing your search above and press return to search.

దిల్ రాజు కమ్ బ్యాక్ ప్లాన్ ఏంటో తెలుసా?

కానీ ఇటీవల దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో గేమ్ ఛేంజర్, ఫ్యామిలీ స్టార్, తమ్ముడు నిరాశపరిచిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలి నష్టాలు తెచ్చిపెట్టాయి.

By:  Tupaki Desk   |   18 Oct 2025 6:00 AM IST
దిల్ రాజు కమ్ బ్యాక్ ప్లాన్ ఏంటో తెలుసా?
X

టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఆ తర్వాత నిర్మాతగా మారారు. ఎన్నో సినిమాలను రూపొందించిన ఆయన.. తెలుగులో అగ్రనిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అనేక చిత్రాలు నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.

కానీ ఇటీవల దిల్ రాజు నిర్మించిన సినిమాల్లో గేమ్ ఛేంజర్, ఫ్యామిలీ స్టార్, తమ్ముడు నిరాశపరిచిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ గా మిగిలి నష్టాలు తెచ్చిపెట్టాయి. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో హిట్ దక్కినా.. దిల్ రాజుపై విమర్శలు మాత్రం వచ్చాయి. ఇప్పుడు ఆయన కమ్ బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ప్రస్తుతం దిల్ రాజు.. భారీ ప్లాన్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. మళ్లీ బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో హిట్స్ అందుకుని సత్తా చాటేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ ఓజీ మూవీని దిల్ రాజు.. డిస్ట్రిబ్యూట్ చేసి లాభాలు అందుకున్నారు.

ఇప్పుడు పవన్ తో చేయనున్న మూవీకి అనిల్ రావిపూడిని రంగంలోకి దించనున్నారని తెలుస్తోంది. అయితే పవర్ స్టార్ సినిమాతోపాటు దిల్‌ రాజు ఇప్పుడు ప్రభాస్‌ తో మరో భారీ ప్రాజెక్ట్‌ కోసం సన్నాహాలు చేస్తున్నారు. వీరిద్దరూ గతంలో మిస్టర్‌ పర్ఫెక్ట్, మున్నా వంటి సినిమాలు చేయగా.. ఇప్పుడు మరో ప్రాజెక్టు కోసం చేతులు కలపనున్నారట.

వచ్చే ఏడాది ఆ ప్రాజెక్టు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. టాలీవుడ్ లో రెండు సినిమాలతోపాటు బాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్టులకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో ఒకటి సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ కాగా.. మరొకటి సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కనున్న యాక్షన్‌ ఎంటర్టైనర్‌ అని టాక్.

సల్మాన్ చేయనున్న మూవీకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించనున్నారని, అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుందని సమాచారం. వీటితోపాటు కోలీవుడ్ లో దిల్ రాజు మరో సినిమా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. గతంలో దళపతి విజయ్‌ హీరోగా వారిసు నిర్మించిన ఆయన.. ఇప్పుడు అజిత్ తో వర్క్ చేయాలని యోచిస్తున్నారట.

ప్రస్తుతం ఆయన లైనప్ లో వేణు ఎల్డండి దర్శకత్వం వహిస్తున్న ఎల్లమ్మ మూవీ కూడా ఉంది. అలా టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమల్లో వివిధ సినిమాలు చేస్తారని సమాచారం. మళ్లీ వరుసగా భారీ హిట్స్ దక్కించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారని వినికిడి. సరైన కథలు, సరైన కాంబినేషన్లు ఎంచుకుంటే మళ్లీ ఫామ్ లో రానున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.