Begin typing your search above and press return to search.

దిల్ రాజు బయోపిక్.. హీరోగా 'తమ్ముడు'!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు తెలుగు టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా రాణిస్తున్నారు.

By:  Tupaki Desk   |   1 July 2025 8:33 AM
దిల్ రాజు బయోపిక్.. హీరోగా తమ్ముడు!
X

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు తెలుగు టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరిగా రాణిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాలు నిర్మించారు. ఇప్పుడు కూడా నిర్మిస్తున్నారు.

ఆ సంస్థకు అనుబంధంగా దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో సంస్థను ప్రారంభించి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలు రూపొందిస్తున్నారు. కొత్త తరాన్ని సినీ ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేయడానికి రీసెంట్ గా దిల్ రాజు డ్రీమ్స్ సంస్థ మొదలుపెట్టారు. మరికొద్ది రోజుల్లో కార్యకలాపాలను ప్రారంభించనున్నారు.

అయితే కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా సాగుతున్న దిల్ రాజు బయోపిక్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం ఆయన కామెంట్సే. దిల్ రాజు నిర్మించిన తమ్ముడు మూవీ మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. అందులో భాగంగా ఇప్పుడు జోరుగా ప్రమోట్ చేస్తున్నారు.

ఆ నేపథ్యంలో తమ్ముడు హీరో నితిన్.. దిల్ రాజుతో స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. భవిష్యత్తులో మీ బయోపిక్ తీసే ఛాన్స్ ఉందా అని నితిన్.. దిల్ రాజును అడిగారు. అప్పుడే అందుకు తగ్గ కంటెంట్ ఉందా అని కూడా క్వశ్చన్ చేశారు. దీంతో వెంటనే దిల్ రాజు.. ఎందుకు లేదు.. కచ్చితంగా కంటెంట్ ఉందని అన్నారు.

"నాది ఒక బిగ్ జర్నీ. కానీ నా బయోపిక్ నేను తీయలేను. 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చా" అని దిల్ రాజు తెలిపారు. ఆ తర్వాత బయోపిక్ లో హీరో ఎవరైతే బాగుంటుందని నితిన్ అడిగారు. అయితే తన ఫేస్ కు మ్యాచ్ హీరో నువ్వు (నితిన్) ఒక్కడివేనని అన్నారు.

నితిన్ మీ బ్రదరా అని చాలామంది అడుగుతుంటారని దిల్ రాజు చెప్పారు. దీంతో నితిన్ స్మైల్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన బయోపిక్ ను బిగ్ స్క్రీన్ మీద చూసుకోవాలనే కోరిక దిల్ రాజులో ఉన్నట్లు అర్థమవుతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి దిల్ రాజు బయోపిక్ ఉంటుందో లేదో వేచి చూడాలి.