నాకెందుకులే అనుకోని ఓ మంచి రాజు!
ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ నిర్మాతలున్నారు. కథల పట్ల ఎంతో సీనియార్టీ సంపాదించిన వారెంతో మంది.
By: Srikanth Kontham | 7 Nov 2025 6:00 PM ISTఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ నిర్మాతలున్నారు. కథల పట్ల ఎంతో సీనియార్టీ సంపాదించిన వారెంతో మంది. వాళ్ల అనుభంతో అప్పుడప్పుడు రచనా విభాగంలోనూ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఏ హీరోకి ఎలాంటి కథ సెట్ అవుతుంది? కమర్శియల్ గా ఎలాంటి కథ వర్కౌట్ అవుతుంది? ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంది? అన్నది ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉంటారు. వాటిని ప్రామాణికంగా తీసుకునే ముందుకెళ్తుంటారు. అయితే చాలా మంది నిర్మాతలు కొత్త తరం నిర్మాతలకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి మాత్రం ముందుకు రారు.
చిన్న నిర్మాతలు సూచనలు:
వారి తప్పులను ఎత్తి చూపే ప్రయత్నం చేయరు. అలా చేస్తే తమనే విమర్శిస్తారు? అన్న భయంతోనూ కొందరు ముందుకురారు. కానీ దిల్ రాజు మాత్రం అలాంటి నిర్మాత కాదనే చెప్పాలి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే నిర్మాతలకు, అప్పటికే కెరీర్ ప్రారంభించిన నిర్మాతలను కొంత వరకూ గైడ్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. తన విలువైన సూచనలు, సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. నిర్మాతలు ఎలాంటి తప్పులు చేయకూడదు? కథల పట్ల ఎలాంటి అవగాహన కలిగి ఉండాలి? వంటి అంశాలపై అవకాశం దొరికిన సందర్భాలో చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
జనాల్ని థియేటర్ కు రప్పించడం గొప్ప:
నిర్మాత అంటే కేవలం డబ్బు పెట్టడం ఒక్కటే కాదని..కథలపై మంచి అవగాహన కలిగి ఉండాలని సూచిస్తుంటారు. ఇండస్ట్రీలో నిర్మాత అలా ఉన్నప్పుడే తాము తీసే సినిమాలు విజయం సాధిస్తాయని, నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుందని హితవు పలుకుతుంటారు. తాజాగా ఓ సినిమా ఈవెంట్ లో సినిమా తీయడం గొప్ప కాదు. థియేటర్ వరకూ ప్రేక్షకుల్ని ఎలా రప్పించాలి? అన్న దానిపైనా కూడా నిర్మాతలు కసరత్తులు చేయాలని సూచించారు. ఎంత గొప్ప సినిమా తీసినా? అది ప్రేక్షకులకు చేరనప్పుడు వృద్ధా ప్రయత్నంగానే మిగిలిపోతుందన్నారు.
అందరి సహకారంతో ఓ మంచి సినిమా:
థియేటర్లో ఆడియన్స్ ను కూర్చోబెట్టడం అన్నది నిర్మాతలు సవాల్ గా తీసుకోవాలన్నారు. మార్నింగ్ షోకి ఆడియన్స్ ను తీసుకురాగలిగితే ఆ తర్వాత పని సినిమాలో కంటెంట్ చేస్తుందని.. అప్పటి నుంచి నిర్మాత చేయాల్సింది పెద్దగా ఉండదన్నారు. సినిమా బాగుంటే తొలి షో మౌత్ టాక్ అనంతరం జనాల్లోకి వెళ్లిపోతుందన్నారు. ఈ ప్రోసస్ లో నటీనటులు, టెక్నికల్ బృందం కూడా అంతే సహకారం అందించాలని సూచించారు. టీమ్ అంతా కలిసి కట్టుగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ రిలీజ్ వరకూ తప్పక చేయాలన్నారు. కథల పట్ల నిర్మాతలు మంచి అవగాహన కలిగి ఉండాలని బడ్జెట్ కూడా కంట్రోల్ చేయోచ్చని గతంలో తెలిపారు. పరిశ్రమలో రాజుగారి ప్రయాణం ఎలా మొదలైందో తెలిసిందే. డిస్ట్రిబ్యూటర్ గా మొదలై అంచెలంచెలుగా అగ్ర నిర్మాతగా ఎదిగారు.
