Begin typing your search above and press return to search.

పెయిడ్ వ్యూస్ కామెంట్స్‌..అంటే క‌లెక్ష‌న్స్ కూడా..?

నితిన్ హీరోగా న‌టించిన మూవీ `త‌మ్ముడు`. శ్రీ‌రామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించారు.

By:  Tupaki Desk   |   12 Jun 2025 5:05 AM
పెయిడ్ వ్యూస్ కామెంట్స్‌..అంటే క‌లెక్ష‌న్స్ కూడా..?
X

నితిన్ హీరోగా న‌టించిన మూవీ `త‌మ్ముడు`. శ్రీ‌రామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించారు. ల‌య రీఎంట్రీ ఇస్తున్న ఈ సినిమా రిలీజ్ గ‌త కొంత కాలంగా `నాన్నా పులి` క‌థ‌లా సాగుతూ ఆడియ‌న్స్‌ని క‌న్ఫ్యూజ్ చేస్తూ వ‌స్తోంది. ఫైన‌ల్‌గా ఈ మూవీని జూలై 4న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఇటీవ‌ల టీమ్ ప్ర‌క‌టించ‌డం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈ మూవీ ట్రైల‌ర్ రిలీజ్ ఈవెంట్‌ని బుధ‌వారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్ వ్యూస్‌పై నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. `యూట్యూబ్‌లో అన్నీ ఒరిజిన‌ల్ నంబ‌ర్సే ఉండాలి. డ‌బ్బులు పెట్టి వ్యూస్ కొన‌కండ‌ని నా పీఆర్ టీమ్‌కి చెప్పాను. ట్రైల‌ర్‌, సాంగ్ ఎంత రీచ్ అవుతుందో తెలిస్తే.. మ‌న సినిమా రీచ్ ఏంటో అర్థ‌మ‌వుతుంది. ఈ మూవీతోనే ఆ అడుగు వేశాను. విష‌యముంటే వంద శాతం ప్రేక్ష‌కులు చూస్తారు` అని కామెంట్ చేశారు.

ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజ్ చేసిన వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీ వర్గాల‌తో పాటు స‌గ‌టు సినీ ల‌వ‌ర్‌ని కూడా ఆశ్చ‌ర్యానికి, షాక్‌కు గురి చేశాయి. ఇండ‌స్ట్రీలో ట్రైల‌ర్‌, సాంగ్ వీడియోల‌కు సంబంధించి యూట్యూబ్‌లో పెయిడ్ వ్యూస్ సంస్కృతి ఉంద‌ని ప్ర‌చారం ఉన్నా ఇంత వ‌ర‌కు ఎవ‌రూ దీన్ని సీరియ‌స్‌గా తీసుకోలేదు. నిజ‌మ‌నని వంద శాతం న‌మ్మ‌లేదు. అంతే కాకుండా `పెయిడ్ వ్యూస్‌`పై ఇంత వ‌ర‌కు ఏ నిర్మాత‌, ద‌ర్శ‌కుడు బ‌హిరంగంగా ఇలా ప్ర‌క‌టించ‌లేదు.

దిల్ రాజు ప్ర‌క‌ట‌న‌తో స‌రికొత్త చ‌ర్చ మొద‌లైంది. అంటే స్టార్ హీరోల సినిమాల ట్రైల‌ర్‌, టీజ‌ర్లుకు 24 గంట‌ల్లో వ‌చ్చే వ్యూస్ ఫేక్ అని, అవ‌న్నీ పెయిడ్ వ్యూస్ అని నెట్టింట చ‌ర్చ మొద‌లైంది. స్టార్ హీరో సినిమా ట్రైల‌ర్ 24 గంట‌ల్లోనే 10 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసింది. రెండు రోజుల్లో 30 మిలియ‌న్‌లు క్రాస్ చేసి రికార్డులు సృష్టించింద‌ని చేసిన ప్ర‌చారం అంతా ఫేకేనా అని అభిమానులు మండిప‌డుతున్నారు.

వ్యూస్ ఫేక్ అని దిల్ రాజు బాహాటంగా చెప్ప‌డంతో మ‌రి క‌లెక్ష‌న్స్ ప‌రిస్థితి కూడా ఇంతేనా? అని అంతా వాపోతున్నారు. మా హీరో సినిమా తొలి రోజు వ‌సూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయ‌ని, అమెరికాలో రెండు మిలియ‌న్‌లు రాబ‌ట్టింద‌ని ఊద‌ర‌గొట్టిందంతా ఫేకేనా, సినిమా ప్ర‌చారంలో భాగ‌మేనా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హీరో అభిమానుల్ని సంతృప్తి ప‌రిచే క్ర‌మంలో నిర్మాత‌లు పోస్ట‌ర్ల‌పై ఫేక్ క‌లెక్ష‌న్‌లు వేస్తార‌ని ఇండ‌స్ట్రీలో ఓ టాక్ ఉంది అది దిల్ రాజు స్టేట్‌మెంట్‌తో నిజ‌మ‌ని తేలింద‌ని అభిమానులు షాక్ అవుతున్నారు.