Begin typing your search above and press return to search.

పుష్ప2 ఐటెం సాంగ్.. ఏదో వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు..

పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా… ఊఊ అంటావా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 May 2024 11:10 AM GMT
పుష్ప2 ఐటెం సాంగ్.. ఏదో వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు..
X

పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా… ఊఊ అంటావా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ సాంగ్ ట్రెండ్ సృష్టించింది. 2021-22లో యుట్యూబ్ ట్రెండింగ్ సాంగ్స్ లో ఈ పాట టాప్ 10లో నిలిచింది. ఆ పాటలో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, లిరిక్స్ ఒక ఎత్తయితే సమంత డాన్స్ పెర్ఫార్మెన్స్ మరో ఎత్తు. అందుకే దేశంలో అత్యధిక మంది వీక్షించిన పాటలలో పుష్ప ఐటెం సాంగ్ కూడా ఉంది.

పుష్ప 2 కోసం అంతకు మించిన సాంగ్ ని దేవిశ్రీ ప్రసాద్ రెడీ చేసారంట. ఈ పాట కూడా ట్రెండ్ సెట్ చేయడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. పుష్ప 2 ఐటెం సాంగ్ కోసం ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో జాన్వీ కపూర్ ఫస్ట్ ఛాయస్ గా ఉందంట. జాన్వీ కపూర్ మంచి క్లాసికల్ డాన్సర్. హిందీలో ఆమెకి సంబందించిన డాన్స్ నెంబర్స్ ఉన్నాయి.

పుష్ప 2 కోసం ఆమెని తీసుకోవాలని అనుకుంటున్నారంట. ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగులో దేవర, RC16 చిత్రాలతో టాలీవుడ్ లో పాన్ ఇండియా హీరోయిన్ గా సత్తా చాటడానికి రెడీ అయ్యింది. ఒక వేళ జాన్వీ కపూర్ సెట్ కాకుంటే త్రిప్తి డిమ్రి పేరు కూడా పరిశీలనలో ఉంది. యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఆమె నటించింది. యానిమల్ చిత్రంలో త్రిప్తి రాత్రికి రాత్రి పాపులర్ అయిపొయింది. యానిమల్ తర్వాత ఆమెకి చాలా సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇక తెలుగులో కూడా త్రిప్తి డేట్స్ కోసం మేకర్స్ ట్రై చేస్తున్నారు. త్రిప్తి క్రేజ్ ని పుష్ప 2 కోసం ఉపయోగించుకోవాలని టీమ్ భావిస్తుందంట.

అందుకే ఆమెని కూడా ఒక ఛాయస్ గా ఉంచినట్లు తెలుస్తోంది. ఇక ఈ పుష్ప 2 ఐటెం సాంగ్ కి సంబంధించి మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఇందులో ఐటెం గర్ల్ తో పాటు హీరోయిన్ గా నటిస్తోన్న రష్మిక మందన కూడా స్టెప్పులు వేయనుందంట. ఆన్ స్క్రీన్ పై ఇద్దరు ముద్దుగుమ్మలతో అల్లు అర్జున్ ఈ సాంగ్ లో వేసే డాన్స్ మూమెంట్స్ ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇదే నిజమైతే పుష్ప 2లోని ఐటెం సాంగ్ కచ్చితంగా మూవీని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. త్వరలో ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ చేయబోతున్నారు. పుష్పలోని శ్రీవల్లి సాంగ్ తరహాలోనే పుష్ప 2లో సెకండ్ సింగిల్ రష్మిక డాన్స్ నెంబర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితం క్లారిటీ ఇచ్చారు.