Begin typing your search above and press return to search.

సిద్ధు జొన్నల్లగడ్డ..​ 'తెలుసు కదా'

ఆమె డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Oct 2023 6:45 AM GMT
సిద్ధు జొన్నల్లగడ్డ..​ తెలుసు కదా
X

ఇండస్ట్రీలో స్టార్ డిజైనర్​గా పేరు తెచ్చుకున్నారు నీరజ కోన. ఇప్పుడామె దర్శకురాలిగా మారడానికి సిద్ధమైపోయారు. డీజే టిల్లు చిత్రంతో యూత్​లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న​ సిద్ధు జొన్నలగడ్డతో కలిసి ఆమె సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్​ అనౌన్స్​ మెంట్​ వీడియో వచ్చేసింది.

వివరాళ్లోకి వెళితే... టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ గురించి తెలిసిందే. ఆయన ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచమైన ఆమె నీరజ కోన. బాద్‌షా చిత్రంతో కాస్ట్యూమ్​ డిజైనర్​గా ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత పలు పెద్ద సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్​గా పని శారు. ఎంతో మంది స్టార్స్​తో కలిసి పనిచేశారు. లిరిక్ రైటర్​గానూ పేరు తెచ్చుకున్నారు.

ఇప్పుడు దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె డీజే టిల్లు హీరో సిద్ధు జొన్నలగడ్డతో ఓ సినిమా చేయబోతున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. 'తెలుసు కదా' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్​ను ఖరారు చేశారు.

ఈ చిత్రంలో కేజీయఫ్​ భామ శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్​గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మిస్తోంది. ఈ ప్రొడక్షన్​ హౌస్​కు ఇది 30వ సినిమా కావడం విశేషం. ఇక వీడియోలోని విజువల్స్​ గ్రాండ్​గా చూపించారు. వీడియో చూస్తుంటే రిఫ్రెషింగ్ స్టోరీ లైన్​తో టాప్ క్లాస్​ స్టాండర్డ్స్​తో తెరకెక్కబోతుందని అర్థమవుతోంది. తమన్ అందించిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ మనసును తాకేలా ఉంది.

నేషనల్ అవార్డ్​ విన్నింగ్ టెక్నిషియన్​ శ్రీకర ప్రసాద్​ ఎడిటర్​గా వ్యవహరిస్తున్నారు. అనివాశ్​ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్​గా బాధ్యతలు చూసుకుంటున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వివేక్ కుచిబొట్ల కో ప్రొడ్యూసర్​. డీఓపీ యువరాజ్​ జే అందిస్తున్నారు. ఈ చిత్రం ఒక అబ్బాయి - అమ్మాయి మధ్య జరిగే ప్రేమ కథ మాత్రమే కాదని, స్నేహం, కుటుంబం, త్యాగం సహా పలు ఎమోషనల్​ అంశాలు ఈ కథలో హైలైట్​గా ఉంటాయని అంటున్నారు.