Begin typing your search above and press return to search.

ఆ మాట రాకూడదనే వాల్తేరు వీరయ్య చేశాడా..?

వెంటనే కథ సెకండ్ హాఫ్ లో రవితేజను తీసుకొద్దామని తన టీం తో అన్నారట బాబీ.

By:  Tupaki Desk   |   18 Jan 2024 3:15 PM GMT
ఆ మాట రాకూడదనే వాల్తేరు వీరయ్య చేశాడా..?
X

మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య సినిమా లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను కె.ఎస్ బాబీ డైరెక్ట్ చేశారు. వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ తర్వాత నందమూరి బాలకృష్ణతో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నారు కె.ఎస్ బాబీ. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో వాల్తేరు వీరయ్య సినిమా బ్యాక్ స్టోరీని వెల్లడించారు. ముందు రవితేజకు ఈ సినిమాలో నటించడం ఇష్టం లేదని కథ విన్నాక మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని చెప్పగా అప్పుడు ఆయన కథ విన్నారని బాబీ చెప్పారు.

వాల్తేరు వీరయ్య సినిమా సెకండ్ హాఫ్ షూటింగ్ జరుగుతుంది. అయితే సినిమాలో ఏదో మిస్ అవుతుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే కథ సెకండ్ హాఫ్ లో రవితేజను తీసుకొద్దామని తన టీం తో అన్నారట బాబీ. వాళ్లు కూడా ఓకే చెప్పడంతో కథ అలా రాశారట. అయితే అప్పటికే సినిమా 80 శాతం చిరంజీవితో షూట్ చేశారట కూడా. మళ్లీ సెకండ్ హాఫ్ లో రవితేజని తీసుకు రావాలని కొన్ని సీన్స్ తీసేశామని చెప్పారు. సినిమాలో తమ్ముడి పాత్రని తీసుకు రావడం దాన్ని హైలెట్ చేయడం గురించి అన్నయ్యకి చెబితే ఏమంటారో అని అనుకున్నా కానీ ఆ పాత్ర గురించి చిరంజీవికి చెప్పగానే తమ్ముడి పాత్ర చేసేది రవితేజనే కదా అని ఆయనే అన్నారు. అలా ఆయన ఓకే నిర్మాత కూడా ఓకే కానీ రవితేజని ఒప్పించడమే అంత ఈజీగా అవ్వలేదని అన్నారు బాబీ.

రవితేజతో సర్ నాకు రేపు ఒక గంటపాటు టైం కావాలని అన్నాను. చిరంజీవి సినిమా అయ్యాక మాట్లాడుదామని అన్నారు. అయితే తాను చిరంజీవి సినిమా కథే వినమంటున్నానని అన్నాను. ఆయన సినిమాలో నన్నో పాత్ర చేమంటున్నావా అని అడిగారు రవితేజ. ముందు కథ చెబుతాను నచ్చితేనే చేయండని అన్నాను. అందుకు రవితేజ వద్దులే అబ్బాయ్ ఇప్పటికే వరుస సినిమాలు ఉన్నాయ్. మళ్లీ కథ చెప్పాక నచ్చలేదంటే అన్నయ్య సినిమాను రవి రిజెక్ట్ చేశాడన్న పేరు వస్తుందని అన్నారు. ఆ టైం లో మీరు కథ వినండి నచ్చకపోతే అసలు నేను మిమ్మల్ని కలిసిన విషయం కూడా ఎవరికీ చెప్పనని చెప్పా. అయినా ఒప్పుకోలేదు కానీ ఎలాగోలా నెక్స్ట్ డే కలిసి కథ చెప్పా.. కథ విన్నాక అన్నయ్యతో ఎప్పటి నుంచో చేయాలని ఉంది. చేసేద్దామని రవితేజ అన్నారు. అలా చిరంజీవి రవితేజ కాంబినేషన్ కుదిరిందని కె.ఎస్ బాబీ చెప్పుకొచ్చారు.

ఇప్పుడు మాస్ రాజాగా క్రేజ్ తెచ్చుకున్నాక రవితేజ చిరుతో నటించాడు కానీ అప్పట్లో అన్నయ్య సినిమాలో రవితేజ చిరు సినిమాలో నటించాడని తెలిసిందే. అప్పటికీ ఇప్పటికీ వారిద్దరి మధ్య సాన్నిహిత్యం అలానే ఉందని తెలుస్తుంది.