Begin typing your search above and press return to search.

అన్న‌ద‌మ్ములిద్ద‌రు జాత‌కాలు చెక్ చేసుకున్నారా?

కెరీర్ ఆరంభ‌మైన నాటి నుంచి శ‌క్తి వంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్నా ఇంకా స్టార్ హీరోలుగా మార‌లేదు.

By:  Tupaki Desk   |   9 April 2024 11:30 PM GMT
అన్న‌ద‌మ్ములిద్ద‌రు జాత‌కాలు చెక్ చేసుకున్నారా?
X

సెల‌బ్రిటీ కుటుంబం నుంచి వ‌చ్చిన ఓ ఇద్ద‌రు హీరోలిప్పుడు ఎలాంటి స్థానాల్లో కొన‌సాగుతున్నారో? చెప్పాల్సిన ప‌నిలేదు. ఇండ‌స్ట్రీలో ఎంతో కాలంగా కొన‌సాగుతున్నారు. ఇండ‌స్ట్రీలో పుట్టి పెరిగిన బిడ్డ‌లు. చిన్న నాటి నుంచి సినిమా వాతావ‌ర‌ణ‌మే. కెరీర్ ఆరంభ‌మైన నాటి నుంచి శ‌క్తి వంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్నా ఇంకా స్టార్ హీరోలుగా మార‌లేదు. అందులోనూ మాస్ ఇమేజ్ కోసం ఎంత‌గా ప్ర‌య‌త్నిస్తున్నా ఆ ప్ర‌త‌య్నాలైతే అస్స‌లు ఫ‌లించ‌డం లేదు.

ఆ ప్రాజెక్ట్ ల కోసం ఎంత శ్ర‌మిస్తున్నా? మాస్ ఇమేజ్ ని ద‌క్కించుకోలేక‌పోతున్నారు. క్లాస్ అనే ఇమేజ్ నుంచి ఆ ఇద్ద‌రు బ‌య‌ట ప‌డలేక‌పోతున్నారు. అందులో ఓ న‌టుడు మాస్ కి రీచ్ అవ్వ‌డానికి అవ‌కాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. కానీ అత‌నికి టైమ్ క‌లిసి రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రు ఫేమ‌స్ స్వామీజీతో ఇటీవ‌ల జాక‌తం చెప్పించికున్న‌ట్లు స‌మాచారం అందుతోంది. స‌ద‌రు స్వామీజి చేయి చూసి ఇద్ద‌రికీ మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని చెప్పారుట‌.

అందులో ఓ న‌టుడికి ఏలిన నాటి శ‌ని ఈ ఏడాదితో తొల‌గిపోతుంద‌ని... ఇక‌పై అన్ని విజ‌యాలే వ‌స్తాయ‌ని..తాను అనుకున్న‌ది సాధిస్తాడ‌ని లీకులందుత‌న్నాయి. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది. ఇక స‌ద‌రు స్వామీజీ హీరోయిన్ల‌కు జాత‌కాలు చెప్పి ఎంత ఫేమ‌స్ అయ్యారో తెలిసిందే. అలాగే చాలా మంది స్టార్ హీరోల భ‌విష్య‌త్ గురించి ఎప్ప‌టిక‌ప్పుడు ఇంట‌ర్వ్యూల్లో చెబుతూనే ఉన్నారు. ఇక ఆ ఇద్ద‌రు హీరోల విష‌యానికి వ‌స్తే ఇండ‌స్ట్రీలో పోటీ బాగా పెరిగిపోతున్న సంగ‌తి తెలిసిందే. వెనుకొచ్చిన వారంతా వంద కోట్ల క్ల‌బ్ లో ఎంతో ఈజీగా చేరుతున్నారు.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వ‌చ్చిన వారు సైతం ఈజీగా 50 కోట్లు..వంద కొట్టు సాధిస్తున్నారు. అలా ఈ మ‌ధ్య కాలంలో ఓ ముగ్గురు న‌లుగురు బాగా ఫేమ‌స్ అయ్యారు. ఎలాంటి బ్యాకప్ లేకుండానే వాళ్లు ఆ రేంజ్ ని సాధించ గ‌ల‌గ‌డం గొప్ప విష‌యం. ట్యాలెంట్ తో పాటు స‌క్సెస్ అవ్వాలి అన్న క‌సి ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేయ‌డంతోనే అది సాధ్య‌మ‌వ్వ‌లేదు. వెనుక చిన్న పాటి అదృష్టం కూడా క‌లిసి వ‌చ్చింది కాబ‌ట్టే సాధ్యమైంది.