Begin typing your search above and press return to search.

సమంత స్టెరాయిడ్స్ తీసుకుందా..?

ఆమె కొంతకాలంగా మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దానికి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆమెకు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇచ్చారట.

By:  Tupaki Desk   |   20 Sep 2023 1:34 PM GMT
సమంత స్టెరాయిడ్స్ తీసుకుందా..?
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. దశాబ్దానికి పైగా సినీతారగా నటిస్తూ అలరిస్తోంది. రీసెంట్ గానే ఆమె ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయితే, ఈ మూవీలో సమంత అందంగా కనపడలేదని, విజయ్ దేవర కొండ ఆమెను డామినేట్ చేశాడు అనే కామెంట్స్ ఎక్కువగా వినిపించాయి.

అంతేకాదు, ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న ఫోటోలు చూసి కూడా సమంత ఏంటి? ఇలా అయిపోయింది అని చాలా మంది కామెంట్స్ చేశారు? సోషల్ మీడియాలో ఫిల్టర్స్ వాడిందని, మేకప్ ఎక్కువ వేసుకుందని ఇలా చాలా ట్రోల్ చేశారు. అయితే, దానికి సమాధానం ఆమె చెప్పారు. రీసెంట్ గా సమంత, తన ఫ్యాన్స్ తో సోషల్ మీడియాలో ముచ్చటించారు.

ఆ సందర్భంగా తాను ఎదుర్కొన్న సమస్య గురించి ఆమె చెప్పారు. ఆమె కొంతకాలంగా మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. దానికి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆమెకు చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఇచ్చారట. అవి కూడా చాలా ఎక్కువ మొత్తంలో తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు చెప్పారు. దాని వల్లే తన చర్మం ఈ విధంగా మారింది అని సమంత చెప్పారు. అందుకే తాను ఇలా కనపడుతున్నట్లు చెప్పారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆమె ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

త్వరలోనే సమంత, ఈ సమస్య నుంచి బయటపడాలని దేవుడిని ప్రార్థరిస్తున్నారు. గతంలోనూ సమంత ఈ సమస్యతో బాధపడ్డారు. ఆ సమయంలో ఆమె రామ్ చరణ్ సరసన ఎవడు మూవీలో నటించాల్సి ఉంది. అయితే, ఈ సమస్య కారణంగా ఆ మూవీ లో నటించే ఛాన్స్ వదులుకున్నారు. ఇప్పుడు మళ్లీ అదే వ్యాధి తీవ్రతరం కావడం గమనార్హం.

కాగా, ఈ వ్యాధి కారణంగానే సమంత, సినిమాలకు దాదాపు సంవత్సరం పాటు గడువు తీసుకున్నారు. చివరగా ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ ప్రమోషన్స్ లోనూ ఆమె చురుకుగా పాల్గొన్నారు. తర్వత మయోసైటిక్ చికిత్స కోసం న్యూ యార్క్ వెళ్లిపోయారు. ఈ చికిత్స పూర్తైన తర్వాతే ఆమె మళ్లీ సినిమాలు అంగీకరించనుంది. కాగా, ఈ లోగా ఆమె ఇండియన్ వర్షన్ సిటాడెల్ వెబ్ సిరీస్ లో నటించింది. అది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.