Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ బ‌య‌ట‌కు రాడా?..ఇక అంతేనా!

మరోవైపు సోష‌ల్ మీడియాలో ఇంట‌ర్వ్యూలు.. మేకింగ్ వీడియోలు అంటూ చాలా హంగామానే క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 5:52 AM GMT
ప్ర‌భాస్ బ‌య‌ట‌కు రాడా?..ఇక అంతేనా!
X

టాలీవుడ్ నుంచి ఓ పాన్ ఇండియా సినిమా రిలీజ్ అవుతుదంటే? ప్ర‌చారం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్య‌మైన ప‌ట్టణాల‌న్నింటిలోనూ ప్రెస్ మీట్ లు..ఇంట‌ర్వ్యూలు ఏర్పాటు చేసి బోలెడంత హైప్ తీసుకొస్తారు. ఇప్పుడింకా ట్రెండ్ మారింది. సొంత ప‌రిశ్ర‌మ‌లోనే కాకుండా ప‌క్క ప‌రిశ్ర‌మ ల్లో సైతం ప్రీ రిలీజ్ ఈవెంట్ లు నిర్వ‌హిస్తున్నారు. మరోవైపు సోష‌ల్ మీడియాలో ఇంట‌ర్వ్యూలు.. మేకింగ్ వీడియోలు అంటూ చాలా హంగామానే క‌నిపిస్తుంది.

తద్వ‌రా సినిమాని జ‌నాల్లోకి ఎంత వీలైంత అంత‌గా తీసుకెళ్తున్నారు. 'బాహుబ‌లి' రాజ‌మౌళి విష‌యంలో ఇంత‌కు మించి స్ట్రాట‌జీని అనుస‌రించి దేశ వ్యాప్తంగా సినిమాని ప్ర‌చారం చేసి వంద శాతం స‌క్సెస్ అయ్యారు. ఆ త‌ర్వాత 'కేజీఎఫ్' ప్ర‌చారం సైతం అలాగే చేసారు. 'సాహో' ప్ర‌చారం కూడా అలాగే జ‌రిగింది. ఇంకా పాన్ ఇండియా లో రిలీజ్ అయిన చాలా సినిమాలు అంతే ఎఫెర్ట్ పెట్టి జ‌నాల్లోకి సినిమాని తీసుకెళ్లారు.

కానీ 'స‌లార్' విష‌యంలో ఎలాంటి హైప్ క‌నిపించ‌డం లేదు. సినిమా రిలీజ్ కి కౌంట్ డౌన్ మొద‌లైనా ఇంత‌వ‌ర‌కూ ప్ర‌భాస్ ఎక్క‌డా బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లు లేదు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ వ్య‌క్తిగ‌తంగా ప్ర‌చారం చేయ‌డం త‌ప్ప ఇంత‌వ‌ర‌కూ చిత్ర నిర్మాణ సంస్థ‌గానీ...ప్ర‌భాస్ గాని సినిమా గురించి మాట్లాడింది లేదు. ఇప్ప‌టికే సినిమాకి సంబంధించి అంచ‌నాలు భారీగా ఉన్నాయి.

ప్ర‌చార చిత్రాలు మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. ఇదే స‌మ‌యంలో డార్లింగ్ మీడియా ముందుకొచ్చి మాట్లాడితే మ‌రింత హైప్ వ‌స్తుంద‌ని అభిమానులు భావిస్తున్నా? ఆ స‌న్నివేశం మాత్రం చోటు చేసుచేసు కోవ‌డం లేదు. ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి ఈవెంట్ చేయ‌లేదు. ఈవెంట్ చేస్తున్న ట్లు ప్ర‌క‌ట‌న కూడా రాలేదు. బ్యానర్స్..హోర్గింగ్స్ కూడా బ‌య‌ట‌క ఎక్క‌డా క‌నిపించ‌లేదు.

ఈ నేప‌థ్యంలో మ‌రిన్ని విష‌యాలు లీక్ అవుతున్నాయి. 'స‌లార్' ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడం లేదని వినిపిస్తుంది. కానీ రాజ‌మౌళి మాత్రం ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్విరాజ్ సుకుమారన్ లతో ఓ ఇంటర్వ్యూ చేసార‌ని దాన్ని బ‌య‌ట‌కు తెచ్చే ప్లాన్ లో ఉన్న‌ట్లు వినిపిస్తుంది. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెలుగు మీడియాతో ఆదివారం మాట్లాడుతార‌ని ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో? ప్ర‌శాంత్ నీల్ స్పందిస్తే గానీ క్లారిటీ రాదు.