Begin typing your search above and press return to search.

ఇకపై ఆకాష్ పూరి కాదు... సక్సెస్‌ దక్కేనా?

అయినా కూడా కెరీర్‌ లో తన ప్రయాణంను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు.

By:  Tupaki Desk   |   25 July 2024 3:08 PM IST
ఇకపై ఆకాష్ పూరి కాదు... సక్సెస్‌ దక్కేనా?
X

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ తనయుడు ఆకాష్ పూరి హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి అయిదు ఏళ్లు దాటింది. అయినా కూడా ఇప్పటి వరకు కమర్షియల్‌ గా ఒక్క సక్సెస్ దక్కించుకోలేక పోయాడు. అయినా కూడా కెరీర్‌ లో తన ప్రయాణంను మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు.

ప్రస్తుతం ఒక సినిమాకు సంబంధించిన చర్చలు జరుపుతున్నారని సమాచారం అందుతోంది. త్వరలోనే ఆకాష్ కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో ఆకాష్ తన పేరును మార్చుకుంటున్నట్టు ప్రకటించడం ద్వారా వార్తల్లో నిలిచాడు.

ఆకాష్ పూరి పుట్టినరోజు సందర్భంగా తన పేరును కాస్త మార్చడంతో పాటు, దాన్నే ఇకపై తన స్క్రీన్ నేమ్ గా ఖరారు చేశాడు, అంతే కాకుండా అందరూ తనను అదే పేరుతో పిలవాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఆకాష్ తన పేరు చివరన ఉన్న పూరి ని తొలగించి జగన్నాథ్‌ అనే పదంను చేర్చడం జరిగింది.

తన తండ్రి పేరులోని పూరి పదంను తొలగించి, ఆయన పేరులోని జగన్నాథ్‌ పదంను చేర్చుకోవడం అనేది న్యూమరాలజీ ప్రకారం కలిసి వస్తుందా లేదంటే మరో రకంగా కలిసి వస్తుందా అంటూ సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

ఇండస్ట్రీలో పేర్లు మార్చుకోవడం అనేది కామన్‌ గా చూస్తూనే ఉంటాం. చాలా మంది హిట్స్ రాకపోవడంతో కలిసి రావడం కోసం పేరు మార్చుకుంటారు. మరి ఆకాష్ ఏ కారణంగా పేరు మార్చుకున్నాడో ఆయనో చెప్పాలి. జనాలు మాత్రం ఇప్పుడు అయినా ఆకాష్ జగన్నాథ్‌ హిట్ కొట్టేనా అంటూ మాట్లాడుకుంటున్నారు.