Begin typing your search above and press return to search.

12 ఏళ్లుగా స‌హజీవ‌నంలో హీరోయిన్?

మా రెండు కుటుంబాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. మా ఇద్ద‌రి నిర్ణ‌యాన్ని గౌరవిస్తారు. మా సంతోషమే అత్యంత ముఖ్యమైనదని ఇరువైపులా భావించారు.

By:  Tupaki Desk   |   29 Jun 2025 9:30 AM IST
12 ఏళ్లుగా స‌హజీవ‌నంలో హీరోయిన్?
X

తాను త‌న భాగ‌స్వామి 12 సంవ‌త్స‌రాలుగా క‌లిసి ఉన్నామ‌ని, పెళ్లితో త‌మ‌కు ప‌ని లేద‌ని అన్నారు న‌టి డ‌యానా పెంటీ. మా ప్రేమ‌కు వివాహ ధృవీకరణ పత్రం అవ‌స‌రం లేద‌ని అన్నారు. స‌మాజం వివాహాన్ని సామాజిక అంశంగా చూపొ్చు.. కానీ కొంద‌రు జంట‌ల‌కు ఇది అవ‌స‌రం లేద‌ని నిరూప‌ణ అవుతోంది.

డ‌యానా పెంటీ.. భాగస్వామి హర్ష్ సాగర్‌తో దశాబ్దానికి పైగా సంబంధంలో ఉన్నారు. వివాహంతో దానిని అధికారికం చేయవలసిన అవసరం లేకుండా దీర్ఘకాలిక లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండటం గురించి ఇటీవల ఓపెన‌య్యారు. తాను ఒంట‌రిగా లేన‌ని, నేను, నా భాగస్వామి 12 సంవత్సరాలుగా కలిసి ఉన్నాము. 22 సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసుకున్నాము`` అని అన్నారు. ఇది నా జీవితంలో సగం. కాబట్టి నేను వివాహం చేసుకోకపోయినా నా లైఫ్ లో నేను హ్యాపీగా ఉన్నాను.

మా రెండు కుటుంబాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. మా ఇద్ద‌రి నిర్ణ‌యాన్ని గౌరవిస్తారు. మా సంతోషమే అత్యంత ముఖ్యమైనదని ఇరువైపులా భావించారు. కాబట్టి పెళ్లి గురించి ఒత్తిడి లేదు. మేము కలిసి జీవిస్తున్నాము. మా కుక్క కలిసి ఉంది. మేము కలిసి ఉన్నామని అందరికీ తెలుసు.. నిజంగా పెళ్లికి ఎటువంటి తొందర లేదు. ఇది దాదాపు వివాహం చేసుకున్నట్లే.. అయితే కాగితంపై ఆధారం లేదు. పెళ్లి మా ఇద్ద‌రికీ ఏదో తేడాను క‌లిగించ‌దు! అని అన్నారు. అయితే బంధం అన్న‌ది ఇరు మ‌న‌సులను క‌లిపి ఉంచేది. దానికి పెళ్లితో ప‌నిలేద‌ని మన‌స్త‌త్వ శాస్త్ర‌వేత్త అతుల్ రాజ్ తెలిపారు.