సినిమాల కంటే ఓటీటీలే ఎక్కువ డిమాండ్ చేస్తాయి
అయితే, తాజాగా ఢిల్లీ టైమ్స్ ఫ్యాషన్ వీక్ జరగ్గా చాలా కాలం తర్వాత డయానా ర్యాంప్‌పై తన సొగసులు ప్రదర్శిస్తూ, అందాలు ఆరబోస్తూ వాక్ చేసింది.
By: Tupaki Desk | 29 May 2025 8:30 AM ISTప్రముఖ మోడల్.. బాలీవుడ్ నటి.. అందాల భామ డయానా పెంటీ పేరు చెప్పగానే మతిపోగట్టే ఆమె వ్యయరాల ఆహార్యం కళ్ల ముందు మెదలకుండా ఉండదు. ఆ మధ్య బాలీవుడ్‌లో బాక్సాఫీసు వద్ద పలు రికార్డులను బద్దలుకొట్టిన ఛావా సినిమాలోనూ మొఘల్ వంశం యువరాణిగా తన అందం, అభినయంతో ఈ అమ్మడు అదరగొట్టింది. మోడలింగ్‌తో కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముంబై సుందరి ఆతర్వాత బాలీవుడ్‌లో సెటిలవడం తెలిసిందే.
అయితే, తాజాగా ఢిల్లీ టైమ్స్ ఫ్యాషన్ వీక్ జరగ్గా చాలా కాలం తర్వాత డయానా ర్యాంప్‌పై తన సొగసులు ప్రదర్శిస్తూ, అందాలు ఆరబోస్తూ వాక్ చేసింది. ఈ సందర్భంగా ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడలింగ్, సినిమాలు, ఓటీటీల గురించి డయానా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. మోడలింగ్‌లో ర్యాంప్ వాక్ వైబ్‌ను బాగా ఆస్వాదిస్తా. మంచి కొరియోగ్రఫీతో కూడిన సంగీతం కూడా ర్యాంప్ వాక్‌కు తోడైతే ఆ అనుభూతి నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది అని డయానా తెలిపింది.
గతంలో చాలాసార్లు ర్యాంప్‌పై నడవడంతో ఆ ఫీల్ ఎలా ఉంటుందో తనకు తెలుసునని, అయితే, ర్యాంప్‌పై పొరపాటున కింద పడకూడదని ఒక భయం కూడా వెంటాడుతుంది అని డయానా చెప్పింది. ఇక, సినిమా కెమెరాలు ముందు ఆత్మవిశ్వాసంతో నటించడం అలవాటు అయినందున ఇప్పుడు ర్యాంప్‌పై నడవడం మరింత సులువైందని తెలిపింది. ఏ పని చేసినా ఆత్మవిశ్వాంతో చేయాలని డయానా చెప్పింది.
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్, సినిమాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందని డయానా తెలిపింది. ప్రస్తుతం తాను ఒక ఓటీటీ కంటెంట్ కోసం పని చేస్తున్నానని తెలిపింది. సినిమాలతో పోలిస్తే నటుల నుంచి ఓటీటీ పాత్రలకు ఎక్కువ స్కోప్ ఉంటుంది. నటుల నుంచి ఓటీటీలు ఎక్కువ కంటెంట్ డిమాండ్ చేస్తాయి. సినిమాలతో పోలిస్తే ఓటీటీల నిడివి ఎక్కువ ఉండడంతో కథలో, పాత్రలో లీనమై మరింత నటించడానికి అవకాశం ఉంటుంది. నటులకు కూడా తమ నటనపై ఒక సంతృప్తి కలుగుతుంది. ఇందులో ఎక్కువ ప్రయోగాలు చేయడానికి అవకాశాలుంటాయని డయానా అభిప్రాయపడింది.
