Begin typing your search above and press return to search.

డాట‌ర్ అనుమ‌తి తీసుకుని డాడీని పెళ్లాడిన సీనియ‌ర్!

బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త దియా మీర్జా వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనా విధానం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటాయి.

By:  Srikanth Kontham   |   22 Jun 2026 4:00 AM IST
డాట‌ర్ అనుమ‌తి తీసుకుని డాడీని పెళ్లాడిన సీనియ‌ర్!
X

బాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్త దియా మీర్జా వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు, ఆలోచనా విధానం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంటాయి. వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో దియా మీర్జా పునర్వివాహం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. రెండు వేర్వేరు కుటుంబాలను..పిల్లలను ఏకం చేసిన అందమైన ప్రయాణం. కొత్త బంధంలోకి అడుగుపెట్టే ముందు దియా మీర్జా ఎదుర్కొన్న పరిస్థితులు.. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకున్న విధానం గురించి దియా పంచుకున్న విషయాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఒక వ్యక్తి భార్య‌తో విడిపోయి పిల్లలు ఉన్నప్పుడు.. వారిని భాగస్వామిగా స్వీకరించే సమయంలో ఆ పిల్లల అంగీకారాన్ని పొందడం ఎంతో ముఖ్యం. వైభవ్ రేఖీ కుమార్తె సమైరా (తొలి భార్య కుమార్తె) అనుమతి దియా వివాహ బంధంలో అత్యంత కీలకమైన అంశమని స్పష్టం చేశారు. సమైరా మనస్ఫూర్తిగా పెళ్లిని ఆమోదిస్తేనే ఈ ముందడుగు వేయాలని దియా మీర్జా నిర్ణ‌యించుకున్నారు. పిల్లల సంతోషాన్ని కాదని పెద్దలు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయన్న‌ది దియా బలంగా నమ్మారు.

వివాహానికి ముందే సమైరాతో మంచి బాండింగ్ ను ఏర్పరచుకోవడానికి దియా ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. బలవంతంగా కొత్త బంధాన్ని పిల్లలపై రుద్దడం కంటే వారి నమ్మకాన్ని గెలుచుకోవడం అవసరమని దియా భావించారు. వైభ‌వ్ తో వివాహానికి ముందు సమైరాకు తగిన సమయం ఇచ్చి ఆమెతో గిడిపి ఆలోచనలను గౌరవించడం ద్వారా వారి మధ్య బలమైన అనుబంధం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యమే తదనంతరం వైభ‌వ్ తో వివాహానికి ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మార్గాన్నిసుగ‌మం చేసింద‌న్నారు దియా.

సమాజంలో సవతి తల్లి అనే పదానికి ఉన్న పాతకాలపు ముద్రలను దియా మీర్జా తన ప్రవర్తనతో పూర్తిగా చెరి పేశారు. సమైరా ఒక సవతి కుమార్తెగా కాకుండా ఒక స్నేహితురాలిగా, సొంత బిడ్డలాగే దియా మీర్జా ప్రేమను పొందింది. ఈ మార్పును స్వీకరించడంలో సమైరా చూపిన పరిణతి, ప్రేమ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని దియా పేర్కొన్నారు. పెళ్లి వేడుకల్లో కూడా సమైరా ఎంతో ఉత్సాహంగా పాల్గొని వధూవరులను వేదికపైకి ముందుకు నడిపించడం వారి మధ్య ఉన్న అవగాహనకు అద్దం పట్టింది.

ఆధునిక సమాజంలో బ్లెండెడ్ ఫ్యామిలీ స్సంస్కృతి పెరుగుతున్న తరుణంలో పరస్పర గౌరవం అనేది ఎంత ముఖ్యమో దియా మాటలు నిరూపిస్తున్నాయి. వివాహం తర్వాత దియా- వైభవ్‌లకు అవ్యాన్ అనే కుమారుడు జన్మించాడు. ప్ర‌స్త‌తుం సమైరా, అవ్యాన్ ఇద్దరూ ఒకే ఇంట్లో ప్రేమతో, అన్నాచెల్లెళ్ల అనుబంధంతో పెరుగు తున్నారు. గ‌త బంధాల తాలూకా చేదు జ్ఞాపకాలను పక్కన పెట్టి సంతోషకరమైన కొత్త కుటుంబాన్ని ఎలా నిర్మించుకోవచ్చో నిరూపించారు.

జీవితంలో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రతి ఒక్కరికీ దియా మీర్జా అనుభవం గొప్ప పాఠంగా నిలుస్తుంది. భాగస్వామిని ప్రేమించడంతో పాటు.. వారి జీవితంతో ముడిపడి ఉన్న పిల్లల సెంటిమెంట్లను కూడా సమానంగా గౌరవించినప్పుడే ఆ సంసారం సజావుగా సాగుతుందని దియా మీర్జా నిరూపించారు. వివాహం అనేది చట్టబద్ధమైన ప్రక్రియ మాత్రమే కాదని.. మనసులను కలిపే పవిత్రమైన బంధమని.. దానికి ఓర్పు, సానుభూతి ఎంతో అవసరమని ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.