ఒకే ఒక్క బ్లాక్‌బస్టర్ ఈ జంటకు ఊపిరి పోసింది
దీప్ వీర్ జంట సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలవడం భారీగా డబ్బు నష్టపోవడం కూడా కుంగదీసింది.. అయితే వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం- దురంధర్.
By: Sivaji Kontham | 20 Feb 2026 7:00 AM ISTఒకే ఒక్క విజయం..దురంధర్ లాంటి ఇండస్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్టు.. చాలా ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది.. ఓవైపు దీపిక పదుకొనే కెరీర్ పూర్తిగా సింక్ అవుతోంది.. తనను రెండు పెద్ద సినిమాల నుంచి తొలగించారు. పాన్ ఇండియా ఆఫర్లు గల్లంతయ్యాయి. ఇది నిజంగా దీపిక - రణ్ వీర్ సింగ్ జంటను కుంగదీసింది. అప్పటికే రణ్ వీర్ సింగ్ ఫుల్ క్రైసిస్ లో ఉన్నాడు.. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. వరుసగా నాలుగేళ్లలో డజను సినిమాలు ఫ్లాపులుగా మారాయి. యావరేజ్ లు తప్ప పెద్ద హిట్లు లేవు. దీంతో అతడు తీవ్ర నిరాశలో ఉన్నాడు..
దీప్ వీర్ జంట సొంత బ్యానర్ లో నిర్మించిన సినిమాలు కూడా డిజాస్టర్ గా నిలవడం భారీగా డబ్బు నష్టపోవడం కూడా కుంగదీసింది.. అయితే వీటన్నిటికీ ఒకే ఒక్క సమాధానం- దురంధర్. ఈ సినిమా సంచలన విజయం సరైన జవాబుగా మారింది. ఇప్పుడు రణ్ వీర్ ఓవైపు హుషారుగా ఉంటే, దీపిక కూడా రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళుతోంది.. సక్సెస్ ఇచ్చే కిక్కు ఎలా ఉంటుందో ఇది ఒక ఉదాహరణ.. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా ఆ ఇద్దరి విషయంలో పాజిటివ్ గా మారుతోంది. తమ నుంచి దూరం జరిగిన ప్రాజెక్టులు కూడా తమను వెతుక్కుంటూ వస్తున్నాయి.
రణవీర్ సింగ్ ఫ్లాపుల పరంపరలో 83, జయేష్‌భాయ్ జోర్దార్, సర్కస్ ఇలా వరుసగా ఉన్నాయి. గత నాలుగేళ్లలో సరైన హిట్ లేక రణవీర్ మార్కెట్ విలువ పడిపోయింది. ఇప్పుడు డాన్ 3 వివాదం, 40 కోట్ల జరిమానా డిమాండ్ కూడా అతడిని మానసికంగా కుంగదీస్తున్నాయ. ఒక దశలో రణవీర్ సింగ్ - దీపికా పదుకొనే జంట కెరీర్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కానీ దురంధర్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ వారిద్దరికీ కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఈ సినిమా ఈ జంటకు లైఫ్ లైన్ లాంటిది. గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేసిన టార్చ్ లైట్.
దీపికా పదుకొనేకు ఎదురుదెబ్బలు ఉన్నాయి. గతేడాది దీపికకు చాలా కష్టకాలం. పనిగంటల విషయంలో వచ్చిన విభేదాల వల్ల దీపికను రెండు అతిపెద్ద పాన్ ఇండియా ప్రాజెక్టుల నుంచి తొలగించారు. కల్కి 2898 ఏడి సీక్వెల్ నుంచి వైజయంతీ మూవీస్ అధికారికంగా దీపికను తొలగించి, సాయి పల్లవిని తీసుకుంటోందని కథనాలొచ్చాయి. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా సినిమా- స్పిరిట్‌లో కూడా దీపిక స్థానంలో త్రిప్తి డిమ్రీ వచ్చిందనే వార్తలు వచ్చాయి.
అన్నీ కోల్పోతున్న సమయంలో ధురంధర్ రణవీర్ దశను మార్చేసింది. ఈ సినిమా అన్ని రికార్డులను తిరగరాస్తూ 1300కోట్లు వసూలు చేసింది. ఈ ఒక్క విజయంతో ట్రేడ్ వర్గాల్లో రణవీర్ సింగ్ ఇమేజ్ మళ్ళీ పెరిగింది. ఇది దీపికా పదుకొనేకు కూడా పరోక్షంగా ప్లస్ అవుతోంది. మొత్తానికి సక్సెస్ ఉంటేనే లోకం గౌరవిస్తుంది! అనే మాటకు ఈ జంట ఒక ఉదాహరణగా నిలిచింది.
