20 ఏళ్ల నటితో 40 ఏళ్ల నటుడు రొమాన్స్!
బాలీవుడ్ నటడు రణవీర్ సింగ్ హీరోగా అదిత్య ధర్ దర్శకత్వంలో `ధురందర్` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 7 July 2025 8:45 AM ISTబాలీవుడ్ నటడు రణవీర్ సింగ్ హీరోగా అదిత్య ధర్ దర్శకత్వంలో 'ధురందర్' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదీ భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఈ చిత్రంతో సారా అర్జున్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. అయితే రణవీర్ సింగ్-సారా మధ్య వయసు వ్యత్యాసం భారీగా ఉంది. ఇద్దరి మద్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయినా హీరోయిన్ గా సారాని ఎంపిక చేయడం ఆసక్తికరం. దీంతో కొంత నెగివిటీ కూడా వ్యక్తమవుతుది. అంత వ్యత్యాసం ఉన్న నటిని హీరోయిన్ గా ఎలా తీసుకుంటారనో విమర్శలొస్తున్నాయి.
మరి వీటికి ఎలాంటి బధులిస్తారు? అన్నది చూడాలి. సినిమాలో ఇద్దరి మధ్య కొన్ని రొమాంటిక్ సన్ని వేశాలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలాలి. సారా అర్జున్ బాలనటి. తెలుగు ఆడియన్స్ కు బాగా తెలిసిన నటే. బాలీవుడ్ నటుడు రాజ్ అర్జున్ కుమార్తె సారా. ఏడాదిన్నర వయసులోనే కెమెరా ముందుకొచ్చింది. రాజ్ అర్జున్ కుటుంబం ఓ సారి షాపింగ్ మాల్ కు వెళ్లగా సారాని చూసి ఓ ప్రకటనా సంస్థ ప్రతినిధులు చూసి యాడ్ ఆఫర్ ఇచ్చారు.
దీంతో సారా కూడా ఆసక్తిగా చేసింది. అది క్లిక్ అవ్వడంతో మరిన్ని అవకాశాలు వచ్చాయి. దాదాపు 50 యాడ్స్ చేసింది. అటుపై చియాన్ విక్రమ్ హీరోగా నటించిన 'నాన్న' సినిమాతో బాల నటిగా ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు సారా వయసు ఆరేళ్లు. తండ్రి-కుమార్తె మధ్య ఎమోషన్ సన్నివేశాలు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల కంట కన్నీరు తెప్పించాయి కూడా.
ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహించిన `పొన్నియన్ సెల్వన్` లో అవకాశం రావడంతో అందు లోనూ నటించింది. ఐశ్వర్యారాయ్ చిన్నప్పటి పాత్రలో నటించింది. అలా సారా కి బాల్యంలోనే కెమెరా అలవా టైంది. మరి ధురందర్ తర్వాత అమ్మడి కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. హీరోయిన్ గా మాత్రం సారాకి మంచి కెరీర్ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
