Begin typing your search above and press return to search.

'ధురంధ‌ర్‌'పై సౌత్ హీరో షాకింగ్ కామెంట్స్‌!

ఈ మూవీని రూపొందించిన తీరుకు మేము మంత్ర‌ముగ్ధుల‌మ‌య్యామ‌న్నారు. అంతే కాకుండా ఇదొక మాస్ట‌ర్ పీస్ అంటూ మేక‌ర్ ఆదిత్య ధ‌ర్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు.

By:  Tupaki Entertainment Desk   |   4 Jan 2026 12:00 AM IST
ధురంధ‌ర్‌పై సౌత్ హీరో షాకింగ్ కామెంట్స్‌!
X

రణ్‌వీర్ సింగ్ న‌టించిన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ 'ధురంధ‌ర్‌' దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. 'యూరి' ఫేమ్ ఆదిత్య‌ధ‌ర్ తెర‌కెక్కించిన ఈ మూవీ ఎలాంటి అంచ‌నాలు లేకుండా సైలెంట్‌గా థియేట‌ర్ల‌లో విడుద‌లైంది. డే వ‌న్ నుంచి మౌత్ టాక్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ రికార్డులు తిర‌గ‌రాస్తోంది. స్పై థ్రిల్ల‌ర్ మూవీస్‌కి పెద్ద స‌వాల్ విసిరి వ‌ర‌ల్డ్ వైడ్‌గా వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ రూ.1200 కోట్లు దాటేసింది.

రిలీజైన‌ ద‌గ్గ‌రి నుంచి బాక్సాఫీస్ వ‌ద్ద ర్యాంపేజ్‌ని కొన‌సాగించిన'ధురంధ‌ర్‌' క‌లెక్ష‌న్‌ల జోరు కొంత మేర త‌గ్గిన‌ప్ప‌టికీ ప్ర‌ముఖుల నుంచి, ప్రేక్ష‌కులు, క్రిటిక్స్ నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటోంది. ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్న వారి జాబితాలోకి సౌత్ హీరో, క్రేజీ క‌థానాయ‌కుడు సూర్య‌, న‌టి జ్యోతిక చేరారు. ఈ మూవీపై సోష‌ల్ మీడియా వేదిక‌గా హీరో సూర్య షేర్ చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. 'ధురంధ‌ర్‌' సినిమాపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ఈ మూవీని రూపొందించిన తీరుకు మేము మంత్ర‌ముగ్ధుల‌మ‌య్యామ‌న్నారు. అంతే కాకుండా ఇదొక మాస్ట‌ర్ పీస్ అంటూ మేక‌ర్ ఆదిత్య ధ‌ర్‌పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించారు. 'ఇలాంటి మాస్ట‌ర్ పీస్‌ని మాకు అందించినందుకు ఆదిత్య ధ‌ర్‌కు ధ‌న్య‌వాదాలు. 'ధురంధ‌ర్‌' వాట్ ఏ మూవీ. చాలా అద్భుతంగా ఉంది. మీ ప‌నిత‌నానికి నేను మంత్ర‌ముగ్ధుడ‌న‌య్యాను. మీరు, మీ టీమ్ అంటే ప్రేమ‌, గౌర‌వం ఏర్ప‌డింది. నా సోద‌రుడు మాధ‌వ‌న్‌కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు.

అక్ష‌య్ ఖ‌న్నా, ర‌ణ్‌వీర్ సింగ్‌ వాట్ ఏ ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్‌. వారు ఈ బ్లాక్ బ‌స్ట‌ర్‌కు అర్హులు. ఈ సంద‌ర్భంగా వారికి నా అభినంద‌న‌లు' అంటూ ట్వీట్ చేశాడు సూర్య‌. అయితే ట్వీట్ ఎండ్‌లో ఇది నా ఒక్క‌డి అభిప్రాయం కాద‌ని, నాది అండ్ జ్యోతికది అని సింబాలిక్‌గా చెప్ప‌డం విశేషం. సూర్య షేర్ చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, అడివి శేష్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక వ‌ర్మ అయితే ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్‌కు భ‌క్తుడైపోయాడు. సందీప్‌రెడ్డి వంగ కూడా ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. కాగా కోలీవుడ్ నుంచి సూర్య 'ధురంధ‌ర్‌'పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం నెట్టింట వైర‌ల్‌గా మారింది.

హీరో సూర్య ప్ర‌స్తుతం ఆర్‌.జె. బాలాజీ డైరెక్ష‌న్‌లో 'క‌రుప్పు' మూవీలో న‌టిస్తున్నాడు.యాక్ష‌న్ డ్రామాకు డివోష‌న‌ల్ అంశాల‌ని జోడించి ఈ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. వ‌రుస ఫ్లాపుల త‌రువాత సూర్య చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ మూవీపై అంచ‌నాలున్నాయి. కొంత విరామం త‌రువాత సూర్య‌కు జోడీగా త్రిష న‌టిస్తోంది. సాయి అభ్యంక‌ర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీని ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.