'ధురంధర్'ఎఫెక్ట్.. మరో వికెట్ డౌన్!
దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సెస్సేషనల్ మూవీ `ధురంధర్`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు.
By: Tupaki Desk | 24 Dec 2025 10:00 PM ISTదేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సెస్సేషనల్ మూవీ `ధురంధర్`. రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించగా యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఆదిత్యధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించాడు. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది. మొదటి వారం నుంచి విమర్శలతో పాటు ప్రశంసల్ని దక్కించుకుంటున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో సంచలనాలు సృష్టిస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లని రాబడుతూ ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది.
రిలీజ్ తరువాత వరల్డ్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.925 కోట్లకు మించి వసూళ్లని రాబట్టింది. త్వరలో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడానికి పరుగులు పెడుతోంది. పాకిస్థాన్ తీవ్రవాద సంస్థలు, ఐఎస్ ఐ, గ్యాంగ్‌స్టర్స్ ఇండియాపై చేసిన కుట్రలని ఓ సీక్రెట్ ఏజెంట్ ఎలా ఛేదించాడు అనే కోణంలో రియిలిస్టిక్ అంశాలని జోడిస్తూ అథెంటిక్‌గా దర్శకుడు ఆదిత్యధర్ ఈ మూవీని రూపొందించి షాక్ ఇచ్చాడు.
ఈ సినిమా ఫలితం కారణంగా రణ్‌వీర్‌సింగ్ `డాన్ 3` మేకర్స్‌కి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే పంథాలో మరో వికెట్ పడినట్టుగా బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రియలిస్టిక్ వేలో..సరికొత్త పద్దతిలో రూపొందిన ఈ సినిమాలో రెహమాన్ డెకాయిట్‌గా అక్షయ్‌ఖన్నా నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. తనదైన మార్కు నటనతో అక్షయ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. తనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాతో నటుడిగా మరింత పాపులారిటీని సొంతం చేసుకున్న అక్షయ్ ఖన్నా ఈ మూవీ అందించిన పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని `దృశ్యం 3` నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.
`ధురంధర్` బ్లాక్ బస్టర్ హిట్ కారణంగా `దృశ్యం 3` కోసం అక్షయ్‌ఖన్నా తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడట. అది మేకర్స్‌ని ఇబ్బంది పెట్టిందని, తన డిమాండ్‌కు అంగీకరించకపోవడంతో అక్షయ్‌ఖన్నా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. `దృశ్యం 2`లో అక్షయ్..తరుణ్ అహ్లావత్‌గా కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే `ధురంధర్` హిట్ తరువాత సమీకరణాలు మారిపోవడంతో తను `దృశ్యం 3` నుంచి తప్పుకున్నాడని ఇన్ సైడ్ టాక్.
`దృశ్యం 2` సమయంలోనే మేకర్స్‌కి అక్షయ్‌కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, ఆ కారణం వల్లే `దృశ్యం 3`ని పక్కన పెట్టాలనుకున్నాడని, లక్కీగా `ధురంధర్` బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అక్షయ్‌కి మంచి అవకాశం లభించి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ మరో వర్గం మాత్రం అక్షయ్ తప్పుకోలేదని చెబుతున్నారు. హిందీ వెర్షన్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ వెర్షన్ షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో హిందీ వెర్షన్‌ని శరవేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
