Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలో బాలీవుడ్ క‌న్నా టాలీవుడ్ బెట‌ర్!

ఈ సినిమా స‌క్సెస్ ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డంలో? బాలీవుడ్ కంటే టాలీవుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లో మెరుగ్గా క‌నిపిస్తున్నాయి. నిత్యం `ధురంధ‌ర్ 2` గురించి తెలుగు మీడియా ఎంతో శ్ర‌ద్ద‌గా క‌థ‌నాలు రాస్తోంది.

By:  Srikanth Kontham   |   26 March 2026 5:00 PM IST
ఆ విష‌యంలో బాలీవుడ్ క‌న్నా టాలీవుడ్ బెట‌ర్!
X

ఇటీవ‌లే రిలీజ్ అయిన `ధురందర్ 2` పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే.ఇప్ప‌టికే చిత్రం 1000 కోట్ల క్ల‌బ్ లో చేరిపోయింది. 2000 కోట్ల వ‌సూళ్ల‌తో భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో స‌రికొత్త రికార్డు న‌మోదు చేస్తుంద‌ని అంచ‌నాలున్నాయి. ఇంతటి భారీ విజయం నమోదైనా? హిందీ చిత్ర పరిశ్రమలోని అగ్ర తారలైన ఖాన్‌లు, కపూర్‌లు స‌హా ఇండ‌స్ట్రీలో చాలా మంది సామాజిక మాధ్యమాల ద్వారా కూడా అభినందనలు తెలపకపోవడం ఇప్ప‌టికే హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త అధ్యాయాన్ని లిఖించే దిశ‌గా అడుగులు వేస్తున్నా? ప‌రిశ్ర‌మ అంతా ఒకే తాటిపైకి వ‌చ్చి మౌనం వ‌హించ‌డం క‌ళ్ల ముందు క‌నిపిస్తూనే ఉంది.

ఈ సినిమా స‌క్సెస్ ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డంలో? బాలీవుడ్ కంటే టాలీవుడ్ స‌హా ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లో మెరుగ్గా క‌నిపిస్తున్నాయి. నిత్యం `ధురంధ‌ర్ 2` గురించి తెలుగు మీడియా ఎంతో శ్ర‌ద్ద‌గా క‌థ‌నాలు రాస్తోంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు, హీరోలు, సాంకేతిక నిపుణుల ప‌నిత‌నాన్ని ప్ర‌శంశిస్తోంది. కానీ సొంత ప‌రిశ్ర‌మ నుంచి ఇవ‌న్నీ ధురంధ‌ర్ కు క‌రువ‌య్యాయి. టాలీవుడ్ లో ఒక సినిమా హిట్ అయితే హీరోల మధ్య పోటీ ఉన్నప్పటికీ ఒకరినొకరు అభినందించుకోవడం స‌హ‌జంగా జ‌రుగుతుంది. లోప‌ల ఎన్ని ఉన్నా? నిజ‌మైన స‌క్సెస్ వ‌చ్చిన స‌మ‌యంలో అంతా ఎంతో స్పోర్టివ్ గా స్పందిస్తుంటారు.

మ‌హేష్‌, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, బ‌న్నీ, ప్ర‌భాస్ స‌హా చాలా మంది అగ్ర‌తారలు సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకంక్ష‌లు చెబుతుంటారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్లు అయితే చిన్న సినిమాలకు కూడా స్వయంగా ఫోన్ చేసి లేదా ఇంటికి పిలిచి మరీ అభినందిస్తుంటారు. ఈ సపోర్టింగ్ కల్చర్ టాలీవుడ్‌లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ బాలీవుడ్ విషయానికి వస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. రణవీర్ సింగ్ వంటి ఎనర్జిటిక్ స్టార్ ఒక పవర్‌ఫుల్ హిట్ కొట్టినప్పుడు, తోటి అగ్ర హీరోలు మౌనం వహించడం వెనుక అంతర్గత రాజకీయాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రణవీర్ తన ఎదుగుదలతో ఎక్కడ తమ స్థానాలను దెబ్బతీస్తాడో అనే అభ‌ద్ర‌తా భావం లేదా గ్రూపిజం వల్లే ఈ మౌనం అని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ తరహా సైలెంట్ పాలిటిక్స్ బాలీవుడ్‌లో కొత్తేమీ కాకపోయినా ఒక భారీ సక్సెస్‌ను ఇలా నిర్లక్ష్యం చేయడం చర్చనీయాంశమైంది. బాలీవుడ్‌లో కనిపించే ఈ మౌనం కేవలం రణవీర్ సింగ్‌కే పరిమితం కాలేదు. గతంలో కూడా బయట నుంచి వచ్చిన నటులు భారీ హిట్లు కొట్టినప్పుడు అక్కడి స్టార్లు ఇలాగే ప్రవర్తించారనే ఆరోపణలు ఉన్నాయి. సినిమా అనేది కళ అని, దాన్ని ఎవరు పండించినా అభినందించడం కనీస ధర్మమని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు.

రణవీర్ సింగ్ ఈ చిత్రం కోసం ప‌డిన కష్టాన్ని గుర్తించకుండా ఈగోల కోసం మౌనంగా ఉండటం బాలీవుడ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తోందని మీడియా క‌థ‌నాలు అంత‌కంత‌కు వేడెక్కిస్తున్నాయి. తెలుగు పరిశ్రమలో కూడా పోటీ ఉంటుంది. కానీ అది కేవలం బాక్సాఫీస్ నంబర్ల వరకే పరిమితం. ఒక సినిమా బాగుంటే అది ఇండస్ట్రీ మొత్తానికి మేలు చేస్తుందని మన హీరోలు నమ్ముతారు. అందుకే రాజమౌళి లాంటి దర్శకులు లేదా ఇతర స్టార్ హీరోలు వేరే భాషా చిత్రాలను సైతం ప్రశంసిస్తూ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. ఈ సమష్టి కృషి వల్లే టాలీవుడ్ నేడు గ్లోబల్ స్థాయిలో ఏల్తోంది.