'ధురంధర్'..బాలీవుడ్ అంత దారుణంగా ఆలోచించిందా?
రన్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ మూవీ `ధురంధర్ 2`. ఆదిత్యధర్ అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటోంది.
By: Ravindar Gorantla | 15 April 2026 3:00 PM ISTరన్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ మూవీ `ధురంధర్ 2`. ఆదిత్యధర్ అత్యంత సాహసోపేతంగా తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలై సంచలన విజయాన్ని సొంతం చేసుకుంటోంది. దుష్ట పాక్ మన ఇండియాపై ఎలాంటి కుట్రలు చేసింది?..ఎక్కడ ఎప్పుడు ఎలాంటి దాడులకు ప్లాన్ చేసింది? దానికి మన ఇండియన్ పొలిటీషియన్స్ ఎలాంటి సహకారాన్ని అందించారు?.. ఇండియాకు ఎలాంటి ద్రోహాన్ని తలపెట్టారు?
నోట్ల రద్దు వెనకున్న అత్యంత కీలకమైన రహస్యం ఏంటీ? ఎవరి వల్ల నోట్ల రద్దు చేయాల్సి వచ్చింది?..ఈ కుట్రలో ఒకప్పటి కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్ పాత్ర ఏంటీ? దుబాయ్ వేదికగా లావాదేవీలు ఎలా జరిగాయి? వంటి కీలక విషయాలతో పాటు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం ఎక్కడ ఉన్నాడు? ఇండియాపై ఎలాంటి కుట్రలు చేశాడు? అనే ఆసక్తికరమైన అంశాల నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ పాలిటిక్స్‌పై ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది.
ఇంట్రెస్టింగ్ అంశాలు, మన రా ఏజెంట్‌లు పాక్‌లో చేసిన అండర్ కవర్ ఆపరేషన్‌ల నేపథ్యంలో యదార్థ సంఘటనలు, దాని వెనుక జరిగిన కుట్రల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సాధిస్తూ వరుస రికార్డుల్ని తిరగరాస్తోంది. ఇప్పటికే వరల్డ్ వైడ్‌గా రూ.1739 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి బాహుబలి రికార్డుని సమం చేసింది. దేశ వ్యాప్తంగానూ రికార్డు స్థాయి వసూళ్లిని రాబడుతూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సినిమాని బాలీవుడ్ తక్కువగా అంచనా వేసిందట.
సినిమా వారంలో తేలిపోతుందని, దీన్ని ఎవరూ పట్టించుకోరని, ఎలా వచ్చిందో తెలియకుండానే థియేటర్లలోంచి వెళ్లిపోతుందని బాలీవుడ్‌లోని చాలా మంది సెలబ్రిటీలు చర్చించుకున్నారట. ఈ విషయాన్ని బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ వెల్లడించి షాక్ ఇచ్చాడు. సోమ వారానికే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోతుందని నాకు అగ్రశేణి దర్శకులే చెప్పారు` అని సంచలన విషయాన్ని బయటపెట్టారు.
అంతే కాకుండా మరో విషయాన్ని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఏ ఒక్కరు కూడా `ధురంధర్`కు సపోర్ట్‌గా నిలవలేదన్నారు. అంతే కాకుండా ఈ సినిమా అత్యంత దారుణంగా ఫ్లాప్ కావాలని చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు రహస్యంగా మీటింగ్‌లు పెట్టుకున్నారని చెప్పి షాక్ ఇచ్చారు. గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండియాకు ద్రోహం చేస్తూ సంఘ విద్రోహ శక్తులకు అండగా నిలుస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా `ధురంధర్` రిలీజ్ తరువాత అదే నిజమని నిరూపించాయని, కునాల్ కోహ్లీ మాటలతో అది స్పష్టమైందనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.
