Begin typing your search above and press return to search.

స్టార్‌ కిడ్‌, లక్కీ లేడీ కబడ్డీ ఆట...!

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు

By:  Tupaki Desk   |   29 Feb 2024 10:00 PM IST
స్టార్‌ కిడ్‌, లక్కీ లేడీ కబడ్డీ ఆట...!
X

తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ తనయుడు ధృవ్‌ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. తెలుగు అర్జున్‌ రెడ్డిని తమిళంలో రీమేక్ చేసిన ధృవ్‌ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత పలు సినిమాల్లో ధృవ్‌ నటిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది.. కానీ ఏ ఒక్కటి సెట్‌ అవ్వలేదు.

ఎట్టకేలకు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ధృవ్‌ రెడీ అయ్యాడు. వీరి కాంబోలో రూపొందబోతున్న సినిమా ప్రకటన వచ్చి చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు రెగ్యులర్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది.

కబడ్డీ ఆట నేపథ్యంలో సినిమా ఉంటుందని సమాచారం అందుతుంది. హీరోయిన్‌ గా లక్కీ లేడీగా పేరు దక్కించుకున్న మలయాళి ముద్దుగుమ్మ దర్శనా రాజేంద్రన్‌ ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈమె తమిళంలో ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్‌ అయ్యింది. ఇది మరో సినిమా గా సమాచారం అందుతోంది.

తమిళనాడు తో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ నిర్వహించబోతున్నారు. తూత్తుకూడి లో దాదాపుగా 80 రోజుల పాటు చిత్రీకరణ ఉంటుందని సమాచారం అందుతోంది. కబడ్డీ ఆట చుట్టూ సాగే ఈ కథ నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.