Begin typing your search above and press return to search.

ఇమేజ్ ని వాయిదాలు డ్యామేజ్ చేస్తున్నాయా?

స్టార్ హీరోల చిత్రాలు వాయిదా ప‌డితే అభిమానులు ఎంత‌లా నిరుత్సాహ ప‌డ‌తారో చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   23 Dec 2023 8:30 AM GMT
ఇమేజ్ ని వాయిదాలు డ్యామేజ్ చేస్తున్నాయా?
X

స్టార్ హీరోల చిత్రాలు వాయిదా ప‌డితే అభిమానులు ఎంత‌లా నిరుత్సాహ ప‌డ‌తారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఎన్నో అంచ‌నాలు..ఆశ‌ల‌తో ఎదురుచూస్తోన్న వారి ఆశ‌ల‌పై ఒక్క‌సారిగా నీళ్లు జ‌ల్లిన‌ట్లు అవుతుంది. చివ‌రికి అది తీవ్ర నెగిటివిటీకి దారి తీస్తుంది. ఓపిక న‌శించిన అభిమానులు సినిమా గురించి నెగిటివ్ గా మాట్లాడ‌టం మొద‌లు పెడ‌తారు. సినిమా అప్ డేట్స్ ఇవ్వ‌క‌పోతే అభిమాన హీరోలైనా ట్రోలింగ్ బారిన ప‌డిన సంద‌ర్భా లెన్నో ఉన్నాయి.

కేవ‌లం అప్ డేట్స్ విష‌యంలోనే ఇలా ఉంటే అదిగో రిలీజ్..ఇదిగో రిలీజ్ అంటూ రిలీజ్ వాయిదా వేసుకుంటూ వెళ్తుంటే నెగిటివిటీ ఇంకే రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. అది ఇమేజ్ పై సైతం ప్ర‌భావం చూపిస్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా చియాన్ విక్ర‌మ్ విష‌యంలో అదే స‌న్నివేశం క‌నిపిస్తోంది. విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌కత్వంలో భారీ అంచ‌నాల మ‌ధ్య 'ధృవ‌న‌క్ష‌త్రం' ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.

కొన్నేళ్ల క్రిత‌మే ప్రారంభ‌మైన సినిమా అనివార్య కార‌ణాల వ‌ల్ల సెట్స్ కి ఆల‌స్యంగా వెళ్ల‌డం ఆ త‌ర్వాత చిత్రీక‌ర‌ణ కూడా అంత‌కంత‌కు ఆల‌స్యమ‌వ్వ‌డం జ‌రిగింది. దీంతో ఈ సినిమా గురించి దాదాపు జ‌నాలంతా మ‌ర్చిపోయారు. అస‌లు ఈ సినిమా ఇంకా ఉందా? అన్న సంగ‌తి ఇటీవ‌ల ఆ సినిమా గురించి మ‌ళ్లీ చెబితే త‌ప్ప తెలియ‌ని స‌న్నివేశం ఎదురైంది. ఈ సినిమా రిలీజ్ చేస్తున్నామంటూ గౌత‌మ్ మీన‌న్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో 'ధృవ‌న‌క్ష‌త్రం' గురించి మ‌ళ్లీ చ‌ర్చ మొద‌లైంది. కానీ సినిమాపై హైప్ మాత్రం ఎక్క‌డా క‌నిపిం చ‌లేదు. విక్ర‌మ్ హీరోగా న‌టించిన‌..గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించినా ఆ సినిమా పై మీడియాలో ఎక్క‌డా హైప్ క్రియేట్ అవ్వ‌డం లేదు. సినిమా ఎలా ఉంటుంది? అన్న‌ది త‌ర్వాత సంగ‌తి ఇద్ద‌రు పేరున్న సెల‌బ్రిటీలుచేసిన సినిమా ప‌రిస్థితి ఇంత వీక్ ఉండ‌టం అన్న‌ది ఆలోచించాల్సిన విష‌య‌మే కదా.

దీనికి తోడు ఈసినిమా రిలీజ్ కూడా వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతుంది. అలాగే పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ హీరోగా 'తంగ‌లాన్' కూడా భారీ అంచ‌నాల మ‌ధ్య తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే విక్ర‌మ్ లుక్..అందులో పాత్ర‌లు చూస్తుంటే? తంగలాన్ భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో క‌నిపిస్తుంది. సినిమా పై మంచి బ‌జ్ ఉంది. కానీ ఆ సినిమా కూడా రిలీజ్ వాయిదా ప‌డ‌టం అభిమానుల్ని క‌ల‌వ‌ర పెడు తుంది. వాయిదాల మీద వాయిదా ప‌డే స‌రికి బ‌జ్ నెగిటివ్ గా జనాల్లోకి వెళ్తుంది. మొత్తంగా ఆ బ‌జ్ హీరో ఇమేజ్ పై తీవ్ర ప్ర‌భావాన్ని సైతం చూపిస్తుంద‌ని మార్కెట్ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.