Begin typing your search above and press return to search.

ప్ర‌చారానికి దూరంగా స్టార్ హీరో?

చియాన్ విక్ర‌మ్ హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ధృవ న‌క్ష‌త్రం' ఎట్ట‌కేల‌కు రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   15 Nov 2023 1:30 PM GMT
ప్ర‌చారానికి దూరంగా స్టార్ హీరో?
X

చియాన్ విక్ర‌మ్ హీరోగా గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'ధృవ న‌క్ష‌త్రం' ఎట్ట‌కేల‌కు రిలీజ్ కి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఏడేళ్ల నుంచి వివిధ ద‌శ‌ల్లో ఉన్న సినిమా 2023 న‌వంబ‌ర్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు రిలీజ్ తేది ప్ర‌క‌టించి వెన‌క్కి వెళ్లిన టీమ్ ఈ సారి మాత్రం ఆ ఛాన్స్ తీసుకోకుండా ముందుకెళ్తుంది. ఇప్ప‌టికే కొన్ని ప్ర‌చార చిత్రాలు రిలీజ్ అయ్యాయి.

వాట‌న్నింటి ని గౌత‌మ్ మీన‌న్ ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. టీజ‌ర్..ట్రైల‌ర్ ..పాట‌లు అన్నీ గౌత‌మ్ మీన‌న్ స‌ర్వంత‌ర్యా మిలా చూసుకుంటున్నారు. సినిమాకి ఆయ‌నే నిర్మాత కూడా కాబ‌ట్టి త‌ప్ప లేదు. ఓవైపు న‌టుడిగా బిజీగా ఉంటూనూ ఈ పెండింగ్ ప్రాజెక్ట్ ని ఎలాగైనా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని రిలీజ్ ఆల‌స్య‌మైనా? వెన‌క్కి త‌గ్గ‌కుండా వ‌స్తున్నారు. అయితే ఈ సినిమా ప్ర‌చారంలో ఎక్క‌డా విక్ర‌మ్ క‌నిపించ‌క‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దృవ న‌క్ష‌త్రానికి సంబంధించి గౌత‌మ్ ఒక్క‌డే మీడియాలో హైలైట్ అవుతున్నాడు త‌ప్ప‌! చియాన్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు.రిలీజ్ కి ఇంకా ఐదు రోజులే ఉన్నా ఆయ‌న జాడ కాన‌రాలేదు. ఎంత తూంగ‌లాన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా గంట‌గ‌డియా క‌నీసం సోష‌ల్ మీడియాలో అయినా ప్ర‌చారం చేయ‌డానికి కూడా ఆయ‌న‌కు స‌మ‌యం లేదా? అన్న సందేహం తలెత్తుతుంది. మ‌రి ప్ర‌చారానికి విక్ర‌మ్ కావాల‌ని దూరంగా ఉంటున్నారా? షూట్ లో బిజీగా ఉండ‌టంతో వీలు ప‌డ‌లేదా? అన్న‌ది క్లారిటీ రావాల్సి ఉంది.

ప్ర‌స్తుతం విక్ర‌మ్ 'తూంగ‌లాన్' అనే పిరియాడిక్ చిత్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కోసం విక్ర‌మ్ రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్ట‌ర్.. ప్ర‌చార చిత్రాల‌న్నీ సినిమాపై భారీ అంచ‌నాలు తీసుకొచ్చాయి. మ‌రోసారి విక్ర‌మ్ మార్క్ పెర్పార్మెన్స్ తో మెప్పించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.