Begin typing your search above and press return to search.

ధృవ‌న‌క్ష‌త్రం ట్రైల‌ర్: లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా వ‌చ్చాడు

ట్రైలర్‌లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. గౌత‌మ్ మీనన్ మార్క్ స్టైలిష్ యాక్ష‌న్ చిత్ర‌మిద‌ని ట్రైల‌ర్ భ‌రోసానిచ్చింది

By:  Tupaki Desk   |   9 Nov 2023 3:29 PM GMT
ధృవ‌న‌క్ష‌త్రం ట్రైల‌ర్: లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా వ‌చ్చాడు
X

నేను లేటుగా వ‌చ్చినా లేటెస్టుగా వ‌స్తా! అన్న చందంగా గౌత‌మ్ మీన‌న్ సినిమా ఆల‌స్యంగా వచ్చినా కానీ దాని ఫ్లేవ‌ర్ మిస్ కానివ్వ‌ద‌ని నిరూపిస్తూ తాజాగా రిలీజైన ధృవ‌న‌క్షత్రం ట్రైల‌ర్ అభిమానుల్లోకి దూసుకెళ్లింది. చియాన్ విక్రమ్ క‌థానాయ‌కుడిగా గౌత‌మ్ మీన‌న్ తెర‌కెక్కించిన `ధృవ నచ్చతిరమ్` ఎట్టకేలకు నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తెలుగులో ధృవ నక్షత్రం పేరుతో విడుదల కానుంది. ఈరోజు తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఆవిష్కరించారు.

ఒకే విధమైన లక్ష్యాలు, ఆలోచనలను షేర్ చేసుకునే నిపుణులతో `బేస్‌మెంట్` అనే పేరుతో ఒక రహస్య బృందం ఏర్పాట చేసి దాంతో ఎలాంటి సాహ‌సాలు చేయించారు? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. వారు చట్టానికి కట్టుబడి ఉండరు. వారు విధానాలను అనుసరించరు. రూల్స్ పేరుతో త‌మాషాలు చూడ‌రు. వారు అనుకున్న ల‌క్ష్యాన్ని తమదైన రీతిలో సాధిస్తారు. చియాన్ విక్రమ్ ఇందులో భాగమే. ఈ సమూహం ఎజెండా ఏమిటి? వారు దేని కోసం పోరాడుతున్నారు? అన్న‌దే ఈ సినిమా.

ట్రైలర్‌లో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. గౌత‌మ్ మీనన్ మార్క్ స్టైలిష్ యాక్ష‌న్ చిత్ర‌మిద‌ని ట్రైల‌ర్ భ‌రోసానిచ్చింది. నిర్మాణ విలువలు అద్బుతంగా ఉండడంతో మేకర్స్ ఈ సినిమాపై భారీగా ఖర్చు పెట్టినట్లు కనిపిస్తోంది. చియాన్ విక్రమ్ ఎప్పటిలాగే అద్భుతంగా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ సంగీత స్వరకర్త. ఒరుఊరిలోరు ఫిల్మ్ హౌస్‌తో కలిసి ఒండ్రంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.