Begin typing your search above and press return to search.

ఆ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్‌ ఛాన్స్‌ లేదా..?

స్టార్‌ హీరో విక్రమ్‌, ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ కాంబోలో రూపొందిన దృవ నక్షత్రం సినిమా గత 8 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది.

By:  Tupaki Desk   |   13 Jun 2025 1:30 AM
ఆ సినిమాకు ఓటీటీ స్ట్రీమింగ్‌ ఛాన్స్‌ లేదా..?
X

స్టార్‌ హీరోల సినిమాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంటుంది, అత్యధిక రేటు పెట్టి కొనుగోలు చేసేందుకు థియేటర్ల వారు, అత్యధిక మొత్తం పెట్టి కొనుగోలు చేసేందుకు ఓటీటీ వారు రెడీగా ఉంటారు. ఇక క్రేజీ డైరెక్టర్‌ దర్శకత్వంలో వచ్చిన సినిమా అంటే కచ్చితంగా విపరీతమైన బజ్ ఉంటుంది. కానీ ఒక సినిమా విషయంలో మాత్రం ఇది పూర్తి రివర్స్‌గా ఉంది. స్టార్‌ హీరో విక్రమ్‌, ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసు దేవ్‌ మీనన్‌ కాంబోలో రూపొందిన దృవ నక్షత్రం సినిమా గత 8 ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చింది. ఆ మధ్య సినిమా వచ్చినట్లే చేశారు. రిలీజ్ డేట్‌ ప్రకటించారు. విడుదలకు సంబంధించిన పోస్టర్స్ వేశారు, కొన్ని గంటల్లో విడుదల అనగా వాయిదా ప్రకటన వచ్చింది.

ఎనిమిది సంవత్సరాలుగా ఈ సినిమాను వాయిదా వేస్తూ వస్తున్న గౌతమ్ వాసు దేవ్‌ మీనన్ మరోసారి ఈ సినిమా విడుదల పట్ల చిత్తశుద్దితో ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఆగస్టులో సినిమాను విడుదల చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తి అయ్యాయి అంటూ మేకర్స్ చెబుతున్నారు. థియేట్రికల్‌ రిలీజ్ కాని ఈ సినిమాను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేయాలని మొదట మేకర్స్ ప్రయత్నించారట. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో థియేట్రికల్‌ రిలీజ్ కాకుండా ఇలాంటి సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు గాను ఓటీటీలు ఏవి కూడా ముందుకు రాలేదు.

భారీ మొత్తంలో చెల్లించి ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేసేంత సీన్‌ ఆ సినిమాకు ఉందా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటే, కొందరు మాత్రం సినిమాలో మంచి మ్యాటర్‌ ఉంటుందనే విశ్వాసం వ్యక్తం చేస్తూ థియేట్రికల్‌ రిలీజ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నామని చెబుతున్నారు. మొత్తానికి దృవ నక్షత్రం సినిమా విడుదల విషయంలో ఉన్న సందిగ్దం ఆగస్టుతో తీరుతుందేమో చూడాలి. దర్శకుడు గౌతమ్‌ మీనన్ ఆమద్య బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించాడు. అంతే కాకుండా ఆయన దర్శకత్వంలో సినిమాలకు నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. కానీ దర్శకత్వంకు, నటనకు దూరంగా ఉంటు మరీ దృవ నక్షత్రం సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.

విక్రమ్‌ ఈ మధ్య కాలంలో ఆశించిన స్థాయిలో విజయాలను సొంతం చేసుకోలేక పోతున్నాడు. అయినా కూడా ఈ సినిమాతో ఆయనకు మంచి విజయం దక్కుతుంది అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో గౌతమ్‌ మీనన్ చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా పట్ల దర్శకుడు మాత్రమే కాకుండా హీరో విక్రమ్‌ సైతం చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. ఆర్థిక పరమైన కారణాల వల్ల దాదాపుగా ఎనిమిది ఏళ్లుగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈ ఏడాదిలో అయినా మోక్షం దక్కించుకుని విడుదల అవుతుందా అనేది చూడాలి. థియేట్రికల్‌ రిలీజ్ తో విజయాన్ని సొంతం చేసుకుంటే ఓటీటీ వారు ఎగబడి మరీ ఈ సినిమాను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.