Begin typing your search above and press return to search.

దూతకు ఈ రెస్పాన్స్ ఊహించలేదు: శరత్ మరార్

భవిష్యత్తులో మరిన్ని డిఫరెంట్ ప్రాజెక్టులో చేయడానికి దూత ఎంతగానో ఉపయోగపడుతుంది

By:  Tupaki Desk   |   7 Dec 2023 8:42 AM GMT
దూతకు ఈ రెస్పాన్స్ ఊహించలేదు: శరత్ మరార్
X

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడుగా నటించిన వెబ్ సిరీస్ దూత ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పై శరత్ మరార్ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ 8 ఎపిసోడ్ లూగా డిసెంబర్ 1 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనే కాకుండా హిందీ తమిళ్ కన్నడ మలయాళం భాషలో దూత వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఈ వెబ్ సిరీస్ సక్సెస్ అయిన సందర్భంగా నిర్మాత శరత్ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలను తెలియజేశారు.

శరత్ మరార్ మాట్లాడుతూ.. ఇంతటి మంచి ప్రాజెక్టుతో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది దాదాపు 200 దేశాలకు పైగా ఈ కంటెంట్ చాలా మంది జనాలకు రీచ్ అయినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అన్ని వైపుల నుంచి మంచి స్పందన వస్తోంది కొత్త తరహా ఫార్మాట్లో మొదటిసారి వెబ్ సిరీస్ చేశాము ఇక ప్రేక్షకుల నుంచి ఇంత మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది మొదట దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఈ కథను చెప్పినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. అయితే అతను అసలు కథ చెప్పినప్పుడు దీన్ని ఎనిమిది ఎపిసోడ్స్ గా ఎలా డివైడ్ చేస్తాడు అనే ఆసక్తి కూడా చాలా ఎక్కువగా ఉండేది.

కానీ దర్శకుడు ఎక్కడ పట్టు తప్పకుండా చాలా గ్రిప్టింగ్తో కథను డిజైన్ చేసుకున్నాడు ఇక అమెజాన్ వాళ్లు భాగస్వామిగా రావడంతో సపోర్ట్ చాలా బాగా అనిపించింది వాళ్లు క్రియేటివ్ పరంగా చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నాగచైతన్య ఈ కథ గురించి చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఇలాంటి కథలు చేస్తే భవిష్యత్తు లో కూడా డిఫరెంట్ కథలు చేయడానికి ఫ్రీడం దొరుకుతుంది అని అన్నాడు. దీంతో మాకు మరింత ప్రోత్సాహం దొరికినట్లు అయింది. దర్శకుడు ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ కోసం చాలా ఆలోచించాడు. ఇక బ్రహ్మానందం గారి కొడుకు గౌతమ్ చేసిన క్యారెక్టర్ కూడా ఎంతో ఆలోచించి సెలెక్ట్ చేసుకున్నదే.

మిగతా ఆర్టిస్టులు అలాగే రవీంద్ర విజయ్ కూడా తనకు ఇచ్చిన పాత్రకు పర్ఫెక్ట్ గా న్యాయం చేశాడు. ప్రియా భవాని శంకర్ పార్వతి తిరువోథు, ప్రాచీ దేశాయి ఇలా అందరూ కూడా వారి పాత్రలకు అనుకున్న దానికంటే ఎక్కువగా న్యాయం చేశారు మొదట నేను టెలివిజన్ రంగం నుంచి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సపోర్ట్ తో సినిమాల్లోకి వచ్చాను. నిర్మాతగా వెండితెరపై డిఫరెంట్ సినిమాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు వెబ్ సిరీస్ కూడా చేయాలి అనే ఆలోచన నాకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది.

భవిష్యత్తులో మరిన్ని డిఫరెంట్ ప్రాజెక్టులో చేయడానికి దూత ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ లో దూతకు సంబంధించిన ఒక ఎపిసోడ్ ను ప్రదర్శించాము. దానికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విక్రమ్ కుమార్ తో కుదిరితే రాబోయే రోజుల్లో మంచి సినిమా కూడా నిర్మిస్తాము. ఇక దూత ప్రాజెక్టు కోసం అయితే కేవలం వంద రోజులు మాత్రమే సమయం తీసుకున్నాము.

ఇందులో వర్షం కూడా ఒక క్యారెక్టర్ తరహాలో వెళుతుంది. ఆ విషయంలో దర్శకుడు ఆలోచించిన విధానం కూడా గ్రేట్ అనే చెప్పాలి. ఇక పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉంది కానీ ఆయన ప్రస్తుతం రాజకీయాలతో అలాగే కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. మంచి కథ దొరికినప్పుడు ఆయన దగ్గరికి వెళ్లి చెప్పగలిగితే ఆయన డేట్స్ ఇస్తారు అని నమ్మకం కూడా నాకు ఉంది.. అని శరత్ కుమార్ వివరణ ఇచ్చారు.