Begin typing your search above and press return to search.

దూత.. ట్రైలర్ తోనే ఊహించని రెస్పాన్స్!

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విక్రమ్ కె కుమార్ ఇప్పుడు దూత అనే క్రేజీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 9:59 AM GMT
దూత.. ట్రైలర్ తోనే ఊహించని రెస్పాన్స్!
X

విభిన్నమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న విక్రమ్ కె కుమార్ ఇప్పుడు దూత అనే క్రేజీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ వెబ్ సిరీస్ లో నాగచైతన్య కథానాయకుడుగా సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ లో రాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ అయ్యాయి.

ఇంతకుముందు నాగచైతన్య ఎప్పుడు కూడా ఇలాంటి కాన్సెప్ట్ లో నటించలేదు. దీంతో నాగచైతన్య ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ కూడా ఈ వెబ్ సిరీస్ చూడడానికి ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. అందుకు కారణం ట్రైలర్ ఎంతో విభిన్నంగా ఉండడమే. విడుదలైన కొన్ని గంటలలోనే యూట్యూబ్లో ట్రేండింగ్ లిస్టులో చేరిపోయింది. ఇక ఆ రెస్పాన్స్ ని బట్టి వెబ్ సిరీస్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

దర్శకుడు విక్రమ్ కే కుమార్ ఇంతకుముందే 13B, 24, మనం లాంటి సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక దూత వెబ్ సిరీస్ కూడా అంతకుమించి అనేలా ఉంటుంది అని ఆడియెన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై శరత్ మరార్ నిర్మించిన దూత వెబ్ సీరీస్ ఆమెజాన్ ప్రైమ్ లో డిసెంబర్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.

ఇక అక్కినేని నాగ చైతన్య దూత వెబ్ సీరీస్ ఒక స్పెషల్ స్ట్రీమింగ్ అరంగేట్రంగా నిలవబోతోంది. ఈ అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క అసలైన సిరీస్ ట్రైలర్ నిన్న నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబడింది. ఈ సిరీస్ గురించి అంతర్దృష్టిని అందించిన ట్రైలర్‌కు అన్ని మూలల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ సిరీస్ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని ట్రైలర్ ద్వారా కూడా స్పష్టమైంది. ప్రధాన నటీనటుల అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ తో పాటు డైరెక్టర్ మేకింగ్ విధానం, సినిమాటోగ్రాఫర్ పనితనం సంగీత దర్శకుల సాంకేతిక నైపుణ్యం వరకు అన్ని అంశాలు ట్రైలర్ లో హైలెట్ అయ్యాయి. ట్రైలర్ 24 గంటల్లో రికార్డు వీక్షణలను పొందింది. ఇక సిరీస్ చుట్టూ ఉత్కంఠ పెరిగింది. డిసెంబర్ 1న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ధూత ప్రీమియర్ ప్రదర్శించబడుతుంది.