Begin typing your search above and press return to search.

టాప్ స్లాట్ లో దూత.. నాగ చైతన్య OTT ఎంట్రీ అదుర్స్..

నవంబర్ 30న రిలీజైన ఈ వెబ్ సీరీస్ ప్రైం వీడియో ఫాలోవర్స్ ని అలరిస్తుంది.

By:  Tupaki Desk   |   3 Dec 2023 12:47 PM GMT
టాప్ స్లాట్ లో దూత.. నాగ చైతన్య OTT ఎంట్రీ అదుర్స్..
X

అక్కినేని నాగ చైతన్య కెరీర్ లో ఫస్ట్ టైం వెబ్ సీరీస్ చేశారు. ఈమధ్య స్టార్ హీరోలు కూడా ఓటీటీ బాట పడుతున్నారు. వారి దారిలోనే నాగ చైతన్య మొదటి వెబ్ సీరీస్ చేశారు. తనతో రెండు సినిమాలు చేసిన విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో దూత సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నాగ చైతన్య. శరత్ మరార్ నిర్మించిన ఈ వెబ్ సీరీస్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ గా వచ్చింది. నవంబర్ 30న రిలీజైన ఈ వెబ్ సీరీస్ ప్రైం వీడియో ఫాలోవర్స్ ని అలరిస్తుంది.

విక్రమ్ కె కుమార్ 13బి తర్వాత మరో సూపర్ న్యాచురల్ కథతో వచ్చారు. సీరీస్ లో నాగ చైతన్య జర్నలిస్ట్ పాత్రలో నటించారు. సాగర్ వర్మ పాత్రలో నాగ చైతన్య తన బెస్ట్ అందించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ వెబ్ సీరీస్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దూతకు వస్తున్న రెస్పాన్స్ చూసి అక్కినేని ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు.

ఈ సీరీస్ తో నాగ చైతన్యకు పర్ఫెక్ట్ ఓటీటీ లాంచ్ జరిగిందని భావిస్తున్నారు. దూత సీరీస్ మొదలు పెట్టిన విధానం బాగుంది.. మొదటి 3 ఎపిసోడ్స్ సీరీస్ పై ఆసక్తి పెంచాయి. అయితే తర్వాత 3 ఎపిసోడ్స్ కాస్త స్లో నరేషన్ తో సాగించినట్టు అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్ పర్వాలేదు అనిపిస్తుంది. అంతేకాదు రెండో సీజన్ కు క్లూ కూడా ఇచ్చాడు విక్రమ్ కె కుమార్.

దూత సీరీస్ లో కెమెరా వర్క్ ఇంప్రెస్ చేస్తుంది. మ్యూజిక్ కొన్ని పోర్షన్స్ లో మెప్పిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా సీరీస్ హిట్ కు కారణమైంది. నాగ చైతన్య మాత్రం తన కెరీర్ లో మరో మంచి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. థ్రిల్లర్ జోనర్ సినిమాలు, సీరీస్ లు ఇష్టపడే వారికి ఈ సీరీస్ అలరిస్తుంది. నాగ చైతన్యతో పాటుగా ఈ సీరీస్ లో ప్రియా భవాని శంకర్, పార్వతి, ప్రాచి దేశాయ్, పసుపతి లీడ్ రోల్స్ లో నటించారు. ప్రైం లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సీరీస్ కు మంచి ప్రేక్షకాదరణ దక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈ సీరీస్ ఇప్పటికే ప్రైమ్ వీడియోస్ లో టాప్ స్లాట్ లో రన్ అవుతుంది.. నాగ చైతన్య కెరీర్ కు దూత కచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు.