Begin typing your search above and press return to search.

మ‌హేష్ బాబుకు అన్న‌య్య‌లా ఉన్నాడు

పాపుల‌ర్ సెల‌బ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ధోని కొత్త హెయిర్‌డో ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 10:31 AM GMT
మ‌హేష్ బాబుకు అన్న‌య్య‌లా ఉన్నాడు
X

ఎం.ఎస్.ధోని త‌న ఆట‌తోనే కాదు.. రూపం కేశాలంక‌ర‌ణతోను నిరంత‌రం చ‌ర్చ‌ల్లో నిలిచాడు. కొన్నేళ్లుగా భారత క్రికెట్ దిగ్గజం MS ధోని వివిధ రకాల హెయిర్ స్టైల్‌లతో క‌నిపించాడు. అయితే ఎన్ని గెట‌ప్పుల్లో క‌నిపించినా కానీ వీట‌న్నిటిలో గొప్ప‌గా పాపుల‌రైన హెయిర్ స్టైల్ ఏది? అంటే..నిస్సందేహంగా భారత క్రికెట్ జట్టులో తన కెరీర్ ప్రారంభంలోని పొడవాటి కేశాలంకరణ అనే అభిమానులు చెబుతారు.


నిజానికి ధోనీ మొదటి ప్రపంచ కప్ టైటిల్ ఆడేప్పుడు 2007లో, అలాగే ICC వరల్డ్ T20 లో కూడా తన పొడవాటి జుట్టుతో యూత్ ని టీజ్ చేసాడు. తన జుట్టు పొడవుగా పెంచుకునే రోజులు గతించాయని ధోనీ ప్ర‌క‌టించినా కానీ ఇప్పుడు మ‌రోసారి యాడ్ షూట్ కోసం పొడవాటి జుట్టు పెంచాడు. పాపుల‌ర్ సెల‌బ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ధోని కొత్త హెయిర్‌డో ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు. ఈ ఫోటోలు షేర్ చేసేప్పుడు హకీమ్ సుదీర్ఘమైన పోస్ట్‌ను కూడా రాసాడు. ఇప్పుడు ఎం.ఎస్.ధోని కొత్త లుక్ గురించి అత‌డి కేశాలంక‌ర‌ణ గురించి ఆయ‌న సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా మాట్లాడారు.

మహేంద్ర సింగ్ ధోనీతో అనుబంధం ఏర్పరచుకోవడానికి క్రియేట‌ర్ గా నాకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. అత‌డి హెయిర్ స్టైల్ ని డిజైన్ చేయడం ద్వారా నా నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి గౌరవం లభించినందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను... మేము గతంలో చాలా అద్భుతమైన కేశాలంకరణను చేసాము. గత ఐపీఎల్‌కు ముందు అందరూ తమ జుట్టును షార్ప్‌గా పొట్టిగా కత్తిరించుకునేటప్పుడు... ఆ సమయంలో మహి భాయ్ నాకు అతడికి సంబంధించిన ఒక ఫోటోని చూపించాడు. అది పొడవాటి జుట్టుతో అతని ఫ్యాన్‌మేడ్ ఇమేజ్. నేను ఆ ఫోటో చూసి ఆకర్షితుడయ్యాను. త‌ర్వాత జుత్తు పెంచమని అభ్యర్థించాను. ఆ జుట్టు బాగా ఎదిగింది. హెయిర్ ని క‌ట్ చేయ‌కుండా, దానిని పెంచుతూ ఉండమని మేమిద్దరం ఒకరికొకరు వాగ్దానం చేసుకున్నాం. ఆపై మేము దానిని కత్తిరించి స్టైలింగ్ చేసాము.

నేను మహి భాయ్ పొడవాటి జుట్టుకు పెద్ద అభిమానిని. మేము జుట్టుకు సరికొత్త ఆకృతిని, కొత్త‌ రంగును సృష్టించాలని నిర్ణయించుకున్నాము...మహీ భాయ్ కోసం ఈ అప్రయత్నమైన కేశాలంకరణను సృష్టించడాన్ని నేను నిజంగా ఆనందించాను. యాడ్ ఫిల్మ్ కోసం వెవ్వడానికి వెళ్ళే ముందు ధోని ఫోటోల‌ను నేను మీకోసం షేర్ చేస్తున్నాను అని తెలిపారు. ధోనీతో కలిసి పనిచేయడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంద‌"ని ఆలీమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. ధోని కొత్త లుక్ చూశాక‌... మ‌హేష్ బాబుకు అన్న‌య్య‌లా ఉన్నాడు! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవ‌ల ఆటకు దూరంగా ఉన్న ఎం.ఎస్. ధోని కొన్ని వ్యాపార‌ వాణిజ్య కార్యకలాపాలతో బిజీగా ఉన్నాడు. దిగ్గజ క్రికెటర్ వచ్చే ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చేర‌తాడ‌ని టాక్ ఉంది.