ధోనీ ధరించిన ఈ షర్ట్ ఖరీదు ఎంతో తెలుసా..!
టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటాడు. ఆయన ఏం చేసినా గల్లీ మీడియా నుంచి ఢిల్లీ మీడియా వరకు ఫోకస్ ఉంటుంది.
By: Tupaki Desk | 14 July 2025 7:02 PM ISTటీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటాడు. ఆయన ఏం చేసినా గల్లీ మీడియా నుంచి ఢిల్లీ మీడియా వరకు ఫోకస్ ఉంటుంది. అప్పుడప్పుడు ట్రోల్స్ మెటీరియల్‌గా కూడా ధోనీ నిలుస్తూ ఉన్నాడు. ధోనీ ఆటలో ఉన్న సమయంలో పదుల సంఖ్యలో బ్రాండ్ అంబాసిడర్‌గా కంపెనీలను ప్రమోట్ చేయడంతో పాటు, చాలా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ అత్యధిక ధనిక క్రికెటర్‌లలో ఒకరిగా ధోనీ నిలిచాడు. ధోనీ వద్ద అత్యంత ఖరీదైన బైక్స్, కార్లు ఉంటాయి. అంతే కాకుండా ధోని కి ఫ్యాషన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన చాలా రకాల ఔట్ ఫిట్‌లను ధరిస్తూ స్టైల్ ఐకాన్‌గా నిలుస్తూ ఉంటాడు.
తాజాగా ధోనీ అత్యంత ఖరీదైన షర్ట్‌ను ధరించడం ద్వారా వార్తల్లో నిలిచాడు. నేవీ బ్లూ హాఫ్ స్లీవ్ షర్ట్‌ను ధరించడం ద్వారా వార్తల్లో నిలిచాడు. ధోనీ ధరించిన ఈ షర్ట్ ఖరీదు రూ.72 వేలు. బ్లూ వాష్డ్ డెనిమ్ జీన్స్ ధరించడం ద్వారా స్టైల్ ఐకాన్‌గా నిలిచిన ధోనీ అందరి దృష్టిని ఆకర్షించాడు. ధోనీ నటించిన షర్ట్ పై పియానో ఆకృతి ఉండటంతో పాటు, షర్ట్ మొత్తం సంగీతంకు సంబంధించిన సింబల్స్ ఉన్నాయి. దాంతో ఈ షర్ట్ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. ధోనీ ధరించిన ఈ షర్ట్ భలే ఉందని ఫ్యాన్స్‌తో పాటు అంతా కూడా కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ధోనీ కి సంబంధించిన ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ధోనీని మరోసారి ఈ షర్ట్ వార్తల్లో నిలిపింది.
ధోనీ ధరించిన ఈ షర్ట్ గురించి నెటిజన్స్ ఇంటర్నెట్‌లో వెతకడం మొదలు పెట్టారు. కొందరు తక్కువ రేటుతో ఉన్న ఇదే తరహా షర్ట్‌ను కొనుగోలు చేశారు, డిజైన్ చాలా విభిన్నంగా ఉండటంతో అంతా కూడా ఆకర్షితులు అవుతున్నారు. అయితే కొందరు మాత్రం ధోనీ ఈ వయసులో స్టైల్ ఐకాన్‌గా ఇలాంటి యూత్ ఫుల్ డ్రెస్‌లు ధరించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ధోనీ ఇంత ఖరీదైన యూత్ ఫుల్ షర్ట్ ను ధరించడం ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నాడు అంటూ కొందరు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ధోనీ గురించిన టాక్, ఆయన ధరించిన షర్ట్ గురించి చర్చలు సోషల్ మీడియాలో తెగ జరుగుతున్నాయి.
ఈ ఏడాదిలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌ల్లో ధోనీ ఘోరంగా విఫలం అయ్యాడు. ఆయన ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ సైతం అత్యంత దారుణంగా విఫలం అయింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ చెత్త రికార్డ్‌లను నమోదు చేయడంతో చాలా మంది ధోనీని విమర్శించారు. ఆయన గౌరవ ప్రదంగా ఇప్పటికే జట్టు నుంచి తప్పుకుని ఉంటే బాగుండేది అంటున్నారు. ఇకపై అయినా ఆయన ఐపీఎల్ కు దూరం అవ్వాలని సూచిస్తున్నారు. ధోనీ వయసు లో ఉన్న వారు జట్టుకు మెంటర్‌గా లేదా మరో రకంగా సేవలు అందిస్తున్నారు. కానీ ధోనీ మాత్రం ఇంకా ఆటగాడిగానే జట్టులో ఉండి భారంగా మారుతున్నాడు అనేది కొందరి అభిప్రాయం. వచ్చే ఏడాది ధోనీ ఐపీఎల్‌లో ఆడుతాడా అనేది చూడాలి.
