Begin typing your search above and press return to search.

మాజీ భార్యతో ధనుష్ క్లాష్.. మధ్యలో తలైవా..

అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ పోటీలో ఉంటే మాత్రం ధనుష్ తప్పుకునే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   10 Nov 2023 6:43 AM GMT
మాజీ భార్యతో ధనుష్ క్లాష్.. మధ్యలో తలైవా..
X

సంక్రాంతి పండగ తెలుగు రాష్ట్రాలలో ప్రజలకి ఎంత ముఖ్యమందో అందరికి తెలిసిందే. అలాగే తమిళనాట కూడా పొంగల్ అంటే కొంత ప్రత్యేకమని చెప్పాలి. ఆ సమయంలో తమిళంలో స్టార్ హీరోలు సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. కోలీవుడ్ లో పొంగల్ కి శివ కార్తికేయన్ మూవీ రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది. దాంతో పాటుగా ధనుష్ హీరోగా అర్జున్ మతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ కెప్టెన్ మిల్లర్ కూడా రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

కెప్టెన్ మిల్లర్ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సిరీస్ తరహాలో మూడు భాగాలుగా ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు. అందులో మొదటి భాగం జనవరి పండగకి రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు నడుస్తున్నాయి. త్వరలో అఫీషియల్ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సంక్రాంతి రేసులో మరో మూవీ కూడా వచ్చి చేరుతోంది.

ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో నటించిన లాల్ సలామ్ మూవీ పొంగల్ కానుకగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్లాన్ లోనే ఉన్నారు. ఈ సినిమాలో విష్ణు విశాల్ ఓ లీడ్ రోల్ లో కనిపిస్తున్నాడు. బాలీవుడ్ తారాగణం కూడా మూవీలో ఉండబోతోంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఐశ్వర్య రజినీకాంత్ ధనుష్ కొన్ని నెలల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఎవరికి వారుగా ఉంటున్నారు. విభేధాల కారణంగా డివోర్స్ తీసుకున్నారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకురాలిగా బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే లాల్ సలామ్ మూవీని తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

ఈ రెండు సినిమాలు సంక్రాంతి రేసులో పోటీ పడితే కచ్చితంగా టఫ్ ఫైట్ అవుతుంది. అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ పోటీలో ఉంటే మాత్రం ధనుష్ తప్పుకునే అవకాశం ఉంది. ఒక వేళ రెండు సినిమాల నిర్మాతలు వెనక్కి తగ్గకపోతే ఎంతో కొంత ప్రతికూలత ఉంటుంది. మరి ఈ రేసులో ఎవరుంటారు, ఎవరు వెనక్కి వెళ్తారనేది వేచి చూడాలి.