Begin typing your search above and press return to search.

లక్ష్ 'ధీర' సెన్సార్.. ఎలా ఉంటుందంటే..

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు.

By:  Tupaki Desk   |   1 Feb 2024 6:00 PM GMT
లక్ష్ ధీర సెన్సార్.. ఎలా ఉంటుందంటే..
X

వలయం, గ్యాంగ్‌ స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్ చదలవాడ. ఇప్పుడు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ధీరతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, ట్రైలర్ కు విశేషమైన స్పందన వచ్చింది.

అయితే ఈ మూవీ హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు దక్కించుకున్న విషయం తెలిసిందే. నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. దిల్ రాజు చేయి పడితే ఆ ప్రాజెక్ట్ స్థాయి మారిపోతోందని సినిమా వర్గాల్లో ఎప్పుడూ టాక్ నడుస్తుంటోంది. ఓ సినిమాను అంచనా వేయడంలో ఆయన శైలి ప్రత్యేకమనే చెప్పొచ్చు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా బాగుందని, మాస్ కమర్షియల్ యాక్షన్ మూవీ అంటూ సెన్సార్ బోర్డు సభ్యులు కొనియాడారు. ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌ గా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ బుధవారం ప్రీ రిలీజ్ వేడుక కూడా నిర్వహించారు.

"పక్కనోడి గురించి పట్టించుకోకుండా తనకు నచ్చింది చేసే ఓ యువకుడికి ఓ మిషన్‌ అప్పగిస్తే అతను ఏం చేశాడనేది ఈ చిత్రం. నా లుక్‌ బాగుందనే ప్రశంసలు వస్తున్నాయి. నిజాయతీగా ఈ సినిమా చేశాం. ఈ వారం వస్తున్న అన్ని సినిమాలు కూడా బాగా ఆడాలి" అంటూ హీరో లక్ష్ చదలవాడ వేడుకను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సినిమాలో లక్ష్ చదలవాడ తో పాటు నేహా పఠాన్, సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు నటించారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ పై పద్మావతి చదలవాడ నిర్మించారు. సాయి కార్తీక్ సంగీతం అందించారు. ఫైట్ మాస్టర్స్ గా జాషువ, వింగ్ చున్ అంజి, ఎడిటర్ గా వినయ్ రామస్వామి వ్యవహరించారు.