నదివే కోసం గాయాల పాలయ్యా
దియా, బ్లింక్ లాంటి కన్నడ సినిమాల్లో నటించిన దీక్షిత్ శెట్టి నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు
By: Tupaki Desk | 18 July 2025 5:30 PM ISTదియా, బ్లింక్ లాంటి కన్నడ సినిమాల్లో నటించిన దీక్షిత్ శెట్టి నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దసరా సినిమాలో నానికి ఫ్రెండ్ గా నటించి తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించిన దీక్షిత్ శెట్టి ప్రస్తుతం ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమా చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీక్షిత్ శెట్టితో పాటూ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
బ్యూటిఫుల్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా మేకర్స్ నదివే అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ఆ సాంగ్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈ సాంగ్ కు యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీక్షిత్ శెట్టి ఈ సాంగ్ షూటింగ్ టైమ్ లో జరిగిన కొన్ని విషయాలను వెల్లడించారు.
దీక్షిత్ స్వతహాగా మంచి డ్యాన్సర్. ఓ డ్యాన్స్ రియాలిటీ షో లో విన్నర్ గా నిలిచిన దీక్షిత్, సినిమా కోసం చేసిన మొదటి డ్యాన్స్ ఇదేనట. కొరియోగ్రాఫర్ విశ్వకిరణ్ నంబితో కలిసి వారం రోజుల పాటూ ఎన్నో ప్రయత్నాలు చేశానని, బాడీని కంట్రోల్ చేసుకుంటూ అన్నింటికీ తగ్గట్టు డ్యాన్స్ చేయడం చాలా కష్టమని, లైవ్ షోలో ఇలాంటివి చేసేటప్పుడు ఏదైనా తప్పులు జరిగినా పెద్దగా పట్టించుకోరని, కానీ సినిమా విషయంలో అలా కాదని దీక్షిత్ తెలిపారు.
అందుకే సినిమాలో ప్రతీదీ పర్ఫెక్ట్ గా చేయడం ముఖ్యమని చాలా కష్టపడ్డామని, సాంగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు తనకు, రష్మికకు చిన్న చిన్న గాయాలు కూడా అయినట్టు దీక్షిత్ తెలిపారు. సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చాక పడ్డ కష్టమంతా మర్చిపోయానని చెప్తున్నారు దీక్షిత్. కాగా ఈ సాంగ్ మనసుకు హత్తుకునే లిరిక్స్ తో పాటూ రష్మిక, దీక్షిత్ మధ్య కెమిస్ట్రీ కూడా ఎట్రాక్ట్ చేస్తూ చాలా బావుంది. హేశం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించిన ఈ సినిమాకు విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
