ఆమెకు ముద్దు బలవంతంగా పెట్టలేదన్న సీనియర్ నటుడు
రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో షబానా అజ్మీతో ముద్దు సన్నివేశంపై ధర్మేంద్ర ఓపెనయ్యారు.
By: Tupaki Desk | 30 July 2023 5:42 AM GMTఅలియా భట్- రణవీర్ సింగ్ జంటగా నటించిన `రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని` జూలై 28న విడుదలైంది. రిలీజ్ డే ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి. కరణ్ జోహార్ పూర్తిగా పాత సినిమాల వాసనతో అవే కథలను సన్నివేశాలను రిపీట్ చేస్తూ తెరకెక్కించాడని కంగన లాంటి రెబల్‌క్వీన్ విమర్శించారు. 250కోట్లు ఈ సీరియల్ లాంటి సినిమాకి ఖర్చు చేయడం వృధా అని కూడా కంగన కామెంట్ చేసారు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భిన్నవాదనలున్నాయి. మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ఆలియా -రణ్‌వీర్ జంటతో పాటు ధర్మేంద్ర- షబానా అజ్మీ .. జయా బచ్చన్ వంటి ప్రముఖ తారాగణం ఇందులో నటించారు. ఈ చిత్రంలో యువజంట అలియా - రణవీర్ మధ్య రొమాన్స్ అభిమానుల హృదయాలను దోచుకోగా సీనియర్ తారలు ధర్మేంద్ర - షబానా అజ్మీల మధ్య ముద్దు సన్నివేశం పెను ప్రకంపనంగా మారింది. ఈ వయసులో ముద్దు అవసరమా? అంటూ చాలా మంది నెటిజనులు ప్రశ్నించారు. ఇది పెద్ద డిబేటబుల్ అంశంగా మారింది. అయితే దీనికి ఇటీవలి ఇంటర్వ్యూలో ధర్మేంద్ర జవాబిచ్చారు. లిప్-లాకింగ్ సన్నివేశం గురించి ఆయన మాట్లాడాడు.
పాపులర్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో- రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీలో షబానా అజ్మీతో ముద్దు సన్నివేశంపై ధర్మేంద్ర ఓపెనయ్యారు. నిజానికి ఈ సన్నివేశం సందర్భం సముచితమైనది. కొన్నాళ్ల తర్వాత విడిపోయిన ఇద్దరు తారలు కలుసుకునే అరుదైన దృశ్యం.. అతడు పాపులర్ రెట్రో సాంగ్ `అభి నా జావో చోడ్ కర్..` పాడుతాడు. ఉద్వేగభరితమైన ముద్దుతో వారి పునఃకలయికను ఘనంగా చాటుతాడు. ఇంటర్వ్యూలో ధర్మేంద్ర మాట్లాడుతూ,-``నేను, షబానా ముద్దు సన్నివేశంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచామని అంతా అంటుంటే వింటున్నాను. అదే సమయంలో వారు ఆ సన్నివేశం చూసి చప్పట్లు కొట్టారన్నది మరువొద్దు. ప్రజలు ఊహించనిది అకస్మాత్తుగా తెరపై కనిపించిందని నేను అనుకుంటున్నాను. అందుకే అది ప్రభావం చూపింది. నేను చివరిసారిగా నఫీసా అలీతో కలిసి `లైఫ్ ఇన్ ఏ మెట్రో`లో ముద్దు సన్నివేశం చేసాను. ఆ సమయంలో కూడా ప్రజలు ముద్దు సీన్ ని మెచ్చుకున్నారు`` అని తెలిపారు.
87 ఏళ్ల నటుడు ధర్మేంద్ర మాట్లాడుతూ .. కరణ్ మాకు సన్నివేశాన్ని వివరించినప్పుడు నేను ఉద్వేగానికి లోనవలేదని దానిని అర్థం చేసుకున్నామని తెలిపారు. అది ఆ సందర్భంలో అవసరమైనది.. బలవంతంగా ఆ సీన్ ని సినిమాలో ఇరికించలేదని నేను గ్రహించాను. ఆ సీన్ చేస్తానని నేను దర్శకుడికి చెప్పాను. అలాగే శృంగారానికి వయస్సు లేదని నేను నమ్ముతున్నాను. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య. ఇద్దరు వ్యక్తులు వయస్సుతో సంబంధం లేకుండా ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం ద్వారా తమ ప్రేమను ప్రదర్శిస్తారు. ఆ సీన్ లో షబానా నేను ఇద్దరం ఏ విధమైన ఇబ్బందిని ఫీలవ్వలేదు. చాలా అందంగా చిత్రీకరించారు`` అని అన్నారు. ఈ సందర్భంగా ధర్మేంద్ర సినిమాని నటీనటులను కొనియాడారు. ``రణ్‌వీర్ అద్భుతం.. అలియా చాలా సహజమైన నటి. సినిమాలో షబానా చాలా బాగుంది. అలాగే నేను ఎప్పుడూ నా గుడ్డి అని పిలుచుకునే జయ కూడా`` అని అన్నారు. ప్రజలు థియేటర్లలో సినిమా చూసి వారి ప్రేమను కురిపించడం కొనసాగించాలని ఆయన కోరారు.
ధర్మేంద్ర తదుపరి `ఎక్కిస్` అనే చిత్రం కోసం `జానీ గద్దర్` దర్శకుడు శ్రీరామ్ రాఘవన్‌తో కలిసి పనిచేయనున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నంద నటిస్తున్నాడు. ఇది అమర సైనికుడిపై జీవితకథతో రూపొందుతున్న బయోపిక్.