Begin typing your search above and press return to search.

శేఖ‌ర్ క‌మ్ములా శివ‌రాత్రి ట్రీట్ అదిరిపోయిందే

#DNS వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోన్న‌ ఈ సినిమాకి 'కుబేర' అనే టైటిల్ ని ఖ‌రారు చేసారు. ధ‌నుష్ లుక్ ని రివీల్ చేస్తూ ఓ రేంజ్ లో లాంచ్ చేసారు.

By:  Tupaki Desk   |   8 March 2024 2:50 PM GMT
శేఖ‌ర్ క‌మ్ములా శివ‌రాత్రి ట్రీట్ అదిరిపోయిందే
X

ధ‌నుష్‌-నాగార్జున కాంబినేష‌న్ లో శేఖ‌ర్ క‌మ్ములా సినిమా అనౌన్స్ మెంట్ తోనే అంచ‌నాలు పీక్స్ కి చేరాయి. క‌మ్ములా మార్క్ ని ప‌క్క‌న‌బెట్టి తొలిసారి గ్యాంగ‌స్ట‌ర నేప‌థ్యాన్ని ట‌చ్ చేయ‌డంతో అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అయ్యాయి. ధ‌నుష్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది? నాగార్జున రోల్ ఎలా ఉంటుంది? అని ఒక‌టే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. తాజాగా శివ‌రాత్రిని పుర‌స్క‌రించుకుని అంద‌రి అంచ‌నాలు మ‌రింత పెంచేలా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్..టైటిల్ రిలీజ్ అయింది.

#DNS వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోన్న‌ ఈ సినిమాకి 'కుబేర' అనే టైటిల్ ని ఖ‌రారు చేసారు. ధ‌నుష్ లుక్ ని రివీల్ చేస్తూ ఓ రేంజ్ లో లాంచ్ చేసారు. చినిగిన బ‌ట్ట‌లు..మాసిన గ‌డ్డం..బ‌ట్ట‌ల‌తో ధ‌నుష్ క‌నిపిస్తోన్న వైనం బిచ్చ‌గాడినే త‌ల‌పిస్తుంది. భ‌గ భ‌గ మండుతోన్న మంట‌ల ముందు శివ‌పార్వ‌తుల ఫోటో రూపం ఎదురుగా త‌దేకంగా చూస్తున్న ధ‌నుష్ లుక్ ని ఓ చిన్న చిరు న‌వ్వుతో ప‌రిచ‌యం చేసారు. బ్యాక్ గ్రౌండ్ లో ఆర్ ఆర్ అంత‌కంత‌కు క్యూరియాసిటీని రెట్టింపు చేస్తుంది.

టైటిల్ కి పూర్తి కాంట్రాస్ట్ గా ధ‌నుష్ లుక్ ఉండ‌టం స‌స్పెన్స్. ఫ‌స్ట్ లుక్ తోనే క‌మ్ములా సినిమాపై ఇంప్రెస్ ప‌డేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ధ‌నుష్ లుక్ ని ఇన్నోవేటివ్ గా డిజైన్ చేయ‌డంతో ఆ పాత్ర వైవిథ్యంగా ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి బిచ్చ‌గాడిలో ధ‌నుష్ చూపించిన నేప‌థ్యంలో అప‌ర కుబేరుడి గా కింగ్ నాగార్జున లుక్ ఉంటుందా? అన్న‌ది స‌స్పెన్స్ .

ప్ర‌స్తుతం ఈ మోష‌న్ పోస్ట‌ర్ నెట్టింట వైర‌ల్ గా మారింది. మ‌రి ధ‌నుష్ పాత్ర‌కి..ముంబై మాఫియా నేప‌థ్యా నికి లింక్ ఏంటి? అన్న‌ది అభిమానుల్లో చ‌ర్చ‌కొస్తున్న అంశం. ఇందులో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టిస్తోంది. ఆమె పాత్ర ఎలా ఉంటుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రం. క‌మ్ములా సినిమాల్లో హీరోయిన్ పాత్ర‌లు సైతం హీరోకి ధీటుగా ఉంటాయి.

ర‌ష్మిక లాంటి పెర్పార్మ‌ర్ ని తీసుకున్నారంటే? క‌మ్ములా ఆమెతో పెద్ద సాహ‌సం చేయించ‌డానికి అవ‌కాశం లేక‌పోలేదు. ఏషియన్‌ సినిమాస్‌- శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్‌ఎల్‌పీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియాలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.