Begin typing your search above and press return to search.

కొత్త పోస్ట‌ర్‌: 'రాయన్' అండ్ గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్‌

ధనుష్ వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టిస్తున్నాడు. త‌దుప‌రి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ లో న‌టించ‌నున్నాడు.

By:  Tupaki Desk   |   14 April 2024 5:26 PM GMT
కొత్త పోస్ట‌ర్‌: రాయన్ అండ్ గ్యాంగ్ హ‌ల్‌చ‌ల్‌
X

ధనుష్ వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్లో న‌టిస్తున్నాడు. త‌దుప‌రి మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా బ‌యోపిక్ లో న‌టించ‌నున్నాడు. అంత‌కుముందే మ‌రో ఆస‌క్తిక‌ర చిత్రాన్ని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తూ ఇందులో టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ర‌య‌న్ పేరుతో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రం ధ‌నుష్ కెరీర్ 50వ చిత్రం.


ద‌ర్శ‌కుడిగా ధ‌నుష్‌కి ఇది రెండో సినిమా. రాయ‌న్ టీజర్ ఈ రోజు తమిళ నూతన సంవత్సరం సందర్భంగా విడుదలవుతుంద‌ని ప్ర‌క‌టించినా కానీ, మేకర్స్ అభిమానులను నిరాశపరిచారు. అయితే ధనుష్ తమిళ న్యూ ఇయర్ సందర్భంగా అభిమానుల కోసం రాయన్ గురించి ఒక కొత్త‌ అప్‌డేట్ ఇచ్చాడు. సినిమా నుంచి మొదటి సింగిల్ ట్రాక్ త్వరలో విడుదల కానుందని ధృవీకరించాడు. ఏఆర్ రెహమాన్ `రాయన్‌`కి సంగీతం అందిస్తున్నందున దీనిపై క్యూరియాసిటీ నెల‌కొంది.

మొదటి సింగిల్ రొమాంటిక్ ట్రాక్ కానుందని భావిస్తున్నారు. అభిమానులకు తమిళ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ‌జేస్తూ ధనుష్ కొత్త పోస్టర్‌ను పోస్ట్ చేసారు. ఇన్ స్టాలో షేర్ చేసిన‌ తాజా పోస్టర్‌లో అతడు తన గ్యాంగ్‌తో కనిపించాడు. తమిళ న్యూ ఇయర్ పోస్టర్‌లో ధనుష్, కాళిదాస్ జయరామ్, సందీప్ కిషన్, దుషారా విజయన్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఇంత‌కుముందే క‌థానాయిక‌ దుషారా విజయన్ యొక్క ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సంగ‌తి తెలిసిందే. గ్యాంగ్‌స్టర్ డ్రామా క‌థ‌తో ఈ చిత్రం రూపొందుతోంది. రాయన్ ఉత్తర చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో న‌డిచే క‌థ‌.

ధనుష్, కాళిదాస్ జయరామ్, సందీప్ కిషన్ సోదరులుగా నటిస్తున్నారు. ఎస్‌జె సూర్య, నిత్యా మీనన్, అపర్ణ బాలమురళి, సెల్వరాఘవన్, శరవణన్‌లు కూడా రాయన్ లో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జూన్‌లో ఈ చిత్రం భారీగా థియేట‌ర్ల‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.