Begin typing your search above and press return to search.

మామ‌-అల్లుడు మ‌ధ్య బిగ్ ఫైట్!

సంక్రాంతికి రెండు నెల‌లు స‌మ‌యం ఉన్నా అప్పుడే సెగ‌లు మొద‌లైపోయాయి. స్టార్ హీరోలంతా ఒక‌రికొ క‌రు పోటీగా దిగిపోతున్నారు

By:  Tupaki Desk   |   20 Nov 2023 12:24 PM GMT
మామ‌-అల్లుడు మ‌ధ్య బిగ్ ఫైట్!
X

సంక్రాంతికి రెండు నెల‌లు స‌మ‌యం ఉన్నా అప్పుడే సెగ‌లు మొద‌లైపోయాయి. స్టార్ హీరోలంతా ఒక‌రికొ క‌రు పోటీగా దిగిపోతున్నారు. టాలీవుడ్ ..కోలీవుడ్ లో ఏ హీరో వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. సెల‌వులు టార్గెట్ గా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాట‌డానికి రెడీ అవుతున్నారు. ఈనేప‌థ్యంలో కోలీవుడ్ నుంచి మామ‌, కుమార్తె ఒక‌వైపు ఉంటే..అల్లుడు ఒక్క‌డే ఆ ఇద్ద‌రితో త‌ల‌ప‌డానికి రెడీ అవుతున్నాడు. బాక్సాఫీస్ హీరో మీరా? నేనా? అని తేల్చుకోవ‌డానికి స‌మాయ‌త్తం అవుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రా అల్లుడు...డాడ్-డాట‌ర్ అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆయ‌న కుమార్తె ఐశ్వ‌ర్య తెర‌కెక్కిస్తోన్న 'లాల్ స‌లామ్' సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్ హీరో పాత్ర పోషించినా ర‌జ‌నీ కాంత్ కీరోల్ లో దిగ‌డంతో అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ఇప్ప‌టికే ర‌జ‌నీ గెట‌ప్ అభిమానుల్లో ఉత్కంఠ‌ని రేపుతుంది. ప్ర‌చార చిత్రాలు సినిమాపై అంచ‌నాలు పెంచేస్తున్నాయి. దీంతో లాల్ స‌లామ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి రికార్డులు న‌మెదు చేస్తుంద‌న్న అంచ‌నాలు మొద‌ల‌య్యాయి.

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో ధ‌నుష్ హీరోగా న‌టిస్తోన్న కెప్టెన్ మిల్ల‌ర్ కూడా రిలీజ్ అవుతుంది. ధ‌నుష నుంచి రిలీజ్ అవుతోన్న పాన్ ఇండియా చిత్ర‌మిది. ఆయ‌న కెరీర్ లోనే తొలి భారీ బ‌డ్జెట్ చిత్రం కూడా. క‌న్నడ సూప‌ర్ స్టార్ శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలతో అంచ‌నాలు ఆకాశ‌న్నంటున్నాయి.

ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే ధ‌నుష్‌-ఐశ్వ‌ర్య దూరంగా ఉన్నారు? అన్న వార్త అంకంత‌కు కొద్ది రోజులుగా హీటెక్కిస్తుంది. ఇద్ద‌రు భార్య భ‌ర్త‌లు అయినా ఈ మ‌ధ్య కాలంలో క‌లిసి క‌నిపించింది లేదు. ఈ వ్య‌వ‌హారంలోకి ర‌జ‌నీ కాంత్ క‌ల్పించుకున్నా స‌ఖ్య‌త కుద‌ర్లేదు అన్న వార్త‌లు మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఈ స‌న్నివేశాలు స‌హా ఆ ఇద్ద‌రి సినిమాలు ఒకేసారి రిలీజ్ కి రెడీ అవ్వ‌డంతో సంక్రాంతికి ఏ హీరోది పై చేయి అవుతుంది? అన్న ఉత్కంఠ ప్రేక్షకాభిమానుల్లో క‌నిపిస్తుంది.