Begin typing your search above and press return to search.

ధనుష్ 'రాయన్' సెన్సార్ కహానీ

అయితే కుబేర మూవీతో పాటు ధనుష్.. రాయన్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 July 2024 5:06 PM GMT
ధనుష్ రాయన్ సెన్సార్ కహానీ
X

తమిళ స్టార్ హీరో ధనుష్ కు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగు సినీ ప్రియులు ధనుష్ చిత్రాలను బాగా ఆదరిస్తారు. అయితే ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తమిళ, తెలుగు చిత్రాలను లైన్ లో పెడుతున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర సినిమా చేస్తున్నారు. కింగ్ నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే కుబేర మూవీతో పాటు ధనుష్.. రాయన్ సినిమా కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీకి డైరెక్టర్ కూడా ధనుషే కావడం విశేషం. సన్ పిక్చర్స్ బ్యానర్‌ పై స్టార్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్.. మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. పోస్టర్స్ అన్నీ మూవీపై ఆసక్తి రేపుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది.

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్.. కంపోజ్ చేసిన సాంగ్ లో ధనుష్ చాలా మంది గ్రామస్తులతో మాస్ డ్యాన్సులు వేస్తూ కనిపించారు. అయితే ధనుష్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ 50వ సినిమాగా రానున్న రాయన్ మూవీపై సినీ ప్రియులతో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా మూవీ రన్ టైమ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ విషయాన్ని తెలిపారు.

రాయన్ సినిమా 140 నిమిషాల (2 గంటల 20 నిమిషాలు) నిడివితో ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రాయన్ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు అనౌన్స్ చేశారు. సెన్సార్ బోర్డు అధికారుల నుంచి ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు తెలిపారు. సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉండడం వల్లే.. సెన్సార్ అధికారులు ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం.

అయితే ఈ మూవీ అంతా.. ఉత్తర మద్రాసు నేపథ్యంలో సాగనున్నట్లు తెలుస్తోంది. రామాయణం, మహాభారతాలకు సమానమైన కొన్ని ముఖ్యమైన అంశాలను తీసుకుని ధనుష్ తెరకెక్కించినట్లు సమాచారం. ఎస్ జే సూర్య, సందీప్ కిషన్, సెల్వ రాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మి శరత్‌ కుమార్, జయరామ్‌ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి జులై 26వ తేదీన విడుదల కానున్న రాయన్ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.