Begin typing your search above and press return to search.

ధనుష్ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే..!

కోలీవుడ్ హీరోలందరిలో స్టార్ హీరో ధనుష్ స్పెషల్ అని చెప్పొచ్చు. చూడటానికి బక్కపలచగా ఉంటాడు కానీ లోపల స్టఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.

By:  Tupaki Desk   |   1 April 2024 1:30 PM GMT
ధనుష్ మాస్టర్ ప్లాన్ లో భాగంగానే..!
X

కోలీవుడ్ హీరోలందరిలో స్టార్ హీరో ధనుష్ స్పెషల్ అని చెప్పొచ్చు. చూడటానికి బక్కపలచగా ఉంటాడు కానీ లోపల స్టఫ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అతని సినిమాలు కేవలం తమిళ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా సౌత్ ఆడియన్స్ అందరినీ అలరిస్తుంటాయి. బాలీవుడ్ లో కూడా ధనుష్ సినిమాలను ఇష్టపడే ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. తనకు సూటయ్యే కథలను.. ప్రేక్షకులకు కొత్త కథ చెప్పాలనుకునే ప్రయత్నంలో ధనుష్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ముఖ్యంగా లో ప్రొఫైల్, కామన్ మ్యాన్ గా ధనుష్ చేసిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర చాలా మంచి ఫలితాలను అందించాయి.

ఈమధ్య ధనుష్ తన పంథా మార్చేశాడు. ఇన్నాళ్లు కేవలం తమిళ సినిమాలు మాత్రమే చేస్తూ వచ్చిన ధనుష్ ఇప్పుడు తెలుగులో కూడా వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఇక్కడ దర్శకులతో తెలుగు, తమిళ బైలింగ్వెల్ సినిమాలు చేస్తున్నాడు ధనుష్. లాస్ట్ ఇయర్ సార్ సినిమాతో అలానే వర్క్ అవుట్ చేసుకున్నాడు. ధనుష్ ప్రస్తుతం తమిళంలో స్వీయ దర్శకత్వంలో రాయన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలే కాకుండా మరో తెలుగు దర్శకుడితో ధనుష్ సినిమా డిస్కషన్స్ లో ఉన్నట్టు తెలుస్తుంది. శర్వానంద్ తో శ్రీకారం సినిమా చేసిన కిశోర్ డైరెక్షన్ లో ధనుష్ సినిమా ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్. ధనుష్ ఇమేజ్ కి తగినట్టుగా ఒక అద్భుతమైన కథతో కిశోర్ కలిశాడట. కథ నచ్చిన ధనుష్ వెంటనే ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. శ్రీకారం సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు కానీ ఆ సినిమా మేకింగ్ పరంగా ఐడియాలజీ పరంగా డైరెక్టర్ కిశోర్ మంచి మార్కులే కొట్టేశాడు.

ఇప్పుడు ధనుష్ కోసం మరో అదిరిపోయే కథతో కిశోర్ రాబోతున్నాడని తెలుస్తుంది. ఈ కాంబో దిల్ రాజు కుదిర్చినట్టు తెలుస్తుంది. ఎలాగు కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ తో గేం చేంజర్ సినిమా చేస్తున్న దిల్ రాజు ఇప్పుడు తమిళ హీరోలతో కూడా వరుస సినిమాలు చేయాలని చూస్తున్నాడు. తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకునే ఆలోచనతో ధనుష్ కూడా ఇక్కడ దర్శక నిర్మాతలతో పనిచేస్తున్నాడు.

ప్రేక్షకులను ఎప్పుడు ధనుష్ సినిమాలు డిజప్పాయింట్ చేయవు. తను ఎలాంటి కథతో వచ్చినా సరే మెప్పిస్తాడు. రాబోతున్న రాయన్, కుబేర రెండు డిఫరెంట్ స్టోరీస్ అని తెలుస్తుంది. వాటితో మరోసారి బాక్సాఫీస్ పై తన స్టామినా చూపించాలని ఫిక్స్ అయ్యాడు ధనుష్.