Begin typing your search above and press return to search.

ధనుష్ మిల్లర్.. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి?

ఆ విధంగానే.. తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా కెప్టెన్ మిల్లర్ మూవీతో ఈసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:44 PM GMT
ధనుష్ మిల్లర్.. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి?
X

ఏటా సంక్రాంతి ఫెస్టివల్ కు బాక్సాఫీస్ దగ్గర మోత మామూలుగా ఉండదు. ఎందుకంటే పెద్ద పండగకు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలందరూ తెగ ట్రై చేస్తుంటారు. ఆ విధంగానే.. తమిళ స్టార్ హీరో ధనుష్ కూడా కెప్టెన్ మిల్లర్ మూవీతో ఈసారి సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అయితే ఈ సినిమా తమిళ, కన్నడ, హిందీ వెర్షన్లు.. 2024 జనవరి 12వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవ్వనున్నాయి. కానీ తెలుగు వెర్షన్ రిలీజ్ పై మాత్రం మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వేరే తేదీన ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తారా.. లేకుంటే నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తారా అన్న విషయంపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

తెలుగులో జనవరి 12వ తేదీన మహేశ్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జా సూపర్ హీరో మూవీ హనుమాన్ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు సినిమాలపై ఇప్పటికే సాలిడ్ బజ్ ఏర్పడింది. ముఖ్యంగా గుంటూరు కారం కోసం మహేశ్ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వేళ.. ధనుశ్ సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ కన్ఫామ్ కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

అయితే ధనుష్ కు తెలుగులో కూడా సాలిడ్ ఫాలోయింగ్ ఉంది. కానీ ఒకే రోజు రెండు క్రేజీ స్ట్రెయిట్ సినిమాలు విడుదలవుతున్నందున థియేటర్ల దొరక్క కెప్టెన్ మిల్లర్ తెలుగు వెర్షన్ రిలీజ్ వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంపై అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీని సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై టీజీ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సందీప్ కిషన్, డాక్టర్ శివ రాజ్ కుమార్, నివేదిత సతీశ్, జాన్ కొక్కెన్, విజయకన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి చిత్రాలకు పనిచేసిన మధన్ కార్కీ ఈ చిత్రం తమిళ వెర్షన్‌కు డైలాగ్స్ అందించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా టీజర్ కూడా ఆకట్టుకుంది. మరి ఈ మూవీ తెలుగు వెర్షన్ విషయంలో మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.