Begin typing your search above and press return to search.

ధ‌నుష్‌కి తండ్రి అని చెప్పుకునే పెద్దాయ‌న‌ మృతి

చివ‌రికి వైద్యుల‌ చికిత్సకు స్పందించక‌పోవ‌డంతో మరణించాడని ధృవీక‌రించారు.

By:  Tupaki Desk   |   13 April 2024 5:19 PM GMT
ధ‌నుష్‌కి తండ్రి అని చెప్పుకునే పెద్దాయ‌న‌ మృతి
X

ప్ర‌ముఖ త‌మిళ‌ న‌టుడు ధనుష్ తన జీవసంబంధమైన కుమారుడని.. అతడి నుండి నెలవారీ భరణం కోరుతూ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (JM) ముందు పిటిషన్ దాఖలు చేసిన వృద్ధుడు శుక్రవారం రాత్రి అనారోగ్యంతో మరణించాడు. ఆర్.కతిరేశన్ (72) మ‌ర‌ణించాడ‌ని కుటుంబ వర్గాలు తెలిపాయి. అత‌డు ప‌లు ర‌కాల‌ ఆరోగ్య సమస్యలతో ఇటీవల మధురైలోని ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి (GRH)లో చేరారు. చివ‌రికి వైద్యుల‌ చికిత్సకు స్పందించక‌పోవ‌డంతో మరణించాడని ధృవీక‌రించారు.

మధురై జిల్లా మేలూర్ తాలూకాలోని మలంపట్టి గ్రామానికి చెందిన కతిరేశన్ , అతడి భార్య మీనాక్షి (60) ధ‌నుష్ గురించి వారి త‌ర‌పు క‌థ‌ను జ‌డ్జికి వినిపించారు. 2002లో XI తరగతి చదువు మానేసిన K. కళైచెల్వన్‌ని తమ మూడవ కొడుకు అని క‌తిరేష‌న్ పేర్కొన్నారు, నటనపై ఆసక్తిని పెంచుకుని చెన్నైకి వెళ్లి అతని స్క్రీన్ పేరును ధనుష్‌గా మార్చుకున్నారు. ధనుష్‌కి DNA పరీక్షలు చేస్తే నిరూపణ అవుతుంద‌ని సవాల్ చేసారు. వారి పితృత్వ దావాలో వృద్ధులైన త‌మ‌ను పోషించ‌డంలో విఫలమైనందున అత‌డి నుండి నెలవారీ రూ 65,000 భరణం కోరాడు.

వారి వాదనను తిరస్కరిస్తూ ధనుష్ ఈ కేసును రద్దు చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్‌ను ఆశ్రయించాడు. DNA పరీక్ష అభ్యర్థనను కూడా వ్యతిరేకించాడు. తాను ఏదో దాచిపెట్టాల‌ని కాదు....ఇలాంటి పనికిమాలిన కేసులు పెట్టే వ్యక్తుల విషయంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం కోసం ఇలా చేసాన‌ని అన్నాడు.

ధనుష్ మాట్లాడుతూ .. తమిళ చిత్ర దర్శకుడు ఆర్.కృష్ణమూర్తి - కె.విజయలక్ష్మి దంపతులకు తాను 28 జూలై 1983లో చెన్నైలో జన్మించానని చెప్పాడు. R.K.వెంగదేశ ప్రభుగా పేరు పెట్టారు. తన తండ్రి, తాను కస్తూరి రాజా - ధనుష్ కె. రాజాగా పేర్లు మార్చుకున్నామ‌ని వాటిని గెజిట్‌లో తెలియజేసామ‌ని చెప్పాడు. అతడు 2005లో తన కుటుంబానికి జారీ చేసిన రేషన్ కార్డు కాపీని చూపాడు. అందులో తన తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు స‌హా త‌న పేరు కూడా ఉంది. ఈ కేసులో ధ‌నుష్ గెలిచాడు. ఓడిపోయిన వృద్ధుడు ఇప్పుడు ఇహ‌లోకంలో లేడు.