Begin typing your search above and press return to search.

ఇలాంటి ప్రయోగాలు తనకే సాధ్యం అనిపించేలా..!

కుబేర సినిమాలో ధనుష్ ఫస్ట్ లుక్ తోనే సినిమా రేంజ్ పెంచేశారు మేకర్స్. ధనుష్ కూడా ఇలాంటి ప్రయోగాలు తన వల్లే సాధ్యం అనేలా చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   9 March 2024 5:10 AM GMT
ఇలాంటి ప్రయోగాలు తనకే సాధ్యం అనిపించేలా..!
X

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఎప్పటికప్పుడు తన కొత్త తరహా పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. తనదైన శైలిలో తనకు మాత్రమే సాధ్యమయ్యే పాత్రలతో పాన్ ఇండియా లెవెల్ లో ధనుష్ ఒక సెపరేట్ బ్రాండ్ ఏర్పరచుకున్నాడు. సహజత్వానికి దగ్గరగా ఉండే కామన్ మ్యాన్ పాత్రలో ధనుష్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలాంటి కథల ఎంపికలో ధనుష్ తన మార్క్ చూపిస్తుంటాడు.

తమిళంలో ధనుష్ చేసిన వడ చెన్నై, అసురన్, కర్ణన్ లాంటి సినిమాలు ప్రత్యేక ఇమేజ్ తెచ్చిపెట్టాయి. అదే తరహాలో ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర అంటూ మరో ఎక్స్ పెరిమెంట్ చేస్తున్నాడు ధనుష్. హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి సెన్సిబుల్ సినిమాలు చేసిన శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం తన స్టైల్ ని మార్చి చేస్తున్న సినిమా కుబేర.

ధనుష్ తో శేఖర్ కమ్ముల సినిమా అనగానే ఆడియన్స్ లో చాలా సందేహాలు వచ్చాయి. వాటన్నింటికీ చెక్ పెట్టేలా కుబేర ఫస్ట్ లుక్ వచ్చింది. ధనుష్ ప్రతి సినిమా ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేస్తూనే వస్తున్నాయి. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూ మరో పక్క కొత్త పాత్రలతో సరికొత్త కథ కథనాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు ధనుష్.

కుబేర సినిమాలో ధనుష్ ఫస్ట్ లుక్ తోనే సినిమా రేంజ్ పెంచేశారు మేకర్స్. ధనుష్ కూడా ఇలాంటి ప్రయోగాలు తన వల్లే సాధ్యం అనేలా చేసుకున్నాడు. కుబేర సినిమాలో ధనుష్ తో పాటుగా కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నాడని తెలిసిందే. సినిమాలో నాగార్జున పాత్ర కూడా ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.

శేఖర్ కమ్ముల, ధనుష్ అసలేమాత్రం ఊహించని ఈ కాంబో ఫస్ట్ లుక్ తో షాక్ ఇవ్వగా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. తను చేసే ఎలాంటి పాత్రతో అయినా ప్రేక్షకులను మెప్పించే సత్తా ఉన్న నటులల్లో ధనుష్ ఒకరు. అందుకే విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ సంపాదించాడు. కుబేర తో తన రేంజ్ మరింత పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు ధనుష్. సినిమా ఎలాగు పాన్ ఇండియా రిలీజ్ అంటున్నారు కాబట్టి ధనుష్ నట విశ్వరూపం నేషనల్ లెవెల్ ఆడియన్స్ కు ఐ ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు.