Begin typing your search above and press return to search.

ధనుష్ 50.. నా ప్రమేయం ఏం లేదు..!

రీసెంట్ గా కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇలా ఒక సినిమా రిలీజైందో లేదో మరో సినిమా పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశాడు.

By:  Tupaki Desk   |   21 Feb 2024 6:28 AM GMT
ధనుష్ 50.. నా ప్రమేయం ఏం లేదు..!
X

రీసెంట్ గా కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇలా ఒక సినిమా రిలీజైందో లేదో మరో సినిమా పోస్టర్ తో సర్ ప్రైజ్ చేశాడు. ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా రాయన్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ తో వచ్చాడు ధనుష్. ధనుష్ మైల్ స్టోన్ మూవీగా 50వ ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ రాయన్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.


అయితే రాయన్ సినిమా స్క్రిప్ట్ గురించి సెల్వ రాఘవన్ లేటెస్ట్ ట్వీట్ ఆడియన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. రాయన్ సినిమా కథకు తనకు ఎలాంటి సంబంధం లేదని ధనుష్ సొంతంగా ఆ కథ రాసుకున్నాడని. అతని డ్రీం ప్రాజెక్ట్ అదని ఎక్స్ లో రాసుకొచ్చారు సెల్వ రాఘవన్. రాయన్ స్క్రిప్ట్ తనదంటూ వచ్చిన వార్తలకు ఆయన స్పందిస్తూ ఇలా కామెంట్ చేశారు. రాయన్ స్క్రిప్ట్ లో తన ప్రమేయం లేదని ధనుష్ సొంతం గా ఈ కథ రాసుకున్నాడని చెప్పుకొచ్చారు.

అంతేకాదు ధనుష్ హార్డ్ వర్క్ ఎప్పుడు తనకు స్పూర్తి కలిగిస్తుందని. తను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కోసం నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఎక్స్ లో కామెంట్ పెట్టారు డైరెక్టర్ సెల్వ రాఘవన్. తను కేవలం ఈ సినిమాలో నటిస్తున్నాను తన్న సినిమా స్క్రిప్ట్ లో తన ప్రమేయం లేదని క్లారిటీ ఇచ్చారు. ధనుష్ 50వ సినిమాగా వస్తున్న రాయన్ ఫస్ట్ లుక్ రిలీజ్ టైం లో తన బ్రదర్ సెల్వ రాఘవన్ కథతో ధనుష్ ఈ సినిమా చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.

వాటికి సమాధానం ఇస్తూ అది ధనుష్ డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పుకొచ్చారు సెల్వ రాఘవన్. ధనుష్ రాయన్ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నాడు. ఆల్రెడీ ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో కూడా సందీప్ కిషన్ చేశాడు. మళ్లీ ఇప్పుడు రాయన్ లో కూడా అతను నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా ధనుష్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ధనుష్ తో పాటుగా కింగ్ నాగార్జున కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. ధనుష్ 50 రిలీజ్ ఎప్పుడన్నది అనౌన్స్ చేయలేదు. ఈ ఇయర్ లోనే రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.