Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ కి మాజీ అల్లుడి శుభాకాంక్షలు!మేటర్ ఏంటి?

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయన ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 6:27 AM GMT
సూపర్ స్టార్‌ కి మాజీ అల్లుడి శుభాకాంక్షలు!మేటర్ ఏంటి?
X

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయన ఫ్యాన్స్ హంగామా మామూలుగా లేదు. ఆయన ఫ్యాన్స్ జాబితాలో ఎంత మంది స్టార్స్ ఉంటారు అనడంలో సందేహం లేదు. తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన యంగ్ స్టార్స్ తో పాటు పలువురు నటీ నటులు రజినీకాంత్‌ కి అభిమానులు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

రజినీకాంత్‌ పై అభిమానంతో అన్ని భాషలకు చెందిన పదుల సంఖ్యల స్టార్స్, సెలబ్రిటీలు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రజినీకాంత్‌ మాజీ అల్లుడు ధనుష్‌ కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌ 'ఎక్స్‌' లో పోస్ట్‌ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

హ్యాపీ బర్త్‌ డే తలైవా అంటూ లవ్ ఈమోజీలను ధనుష్ షేర్‌ చేసి, తనకు రజినీకాంత్‌ పై ఉన్న అభిమానం ను చెప్పకనే చెప్పాడు. సుదీర్ఘ కాలం పాటు రజినీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య తో వైవాహిక జీవితం కొనసాగించిన ధనుష్ ఇటీవల ఆమె నుంచి విడాకులు తీసుకున్నట్లు గా ప్రకటించిన విషయం తెల్సిందే.

ఐశ్వర్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఆమె తండ్రి అయిన రజినీకాంత్‌ కి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడం ద్వారా ధనుష్ తన మంచి మనసును చాటుకున్నాడు అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.