ఒక్క అనౌన్స్‌మెంట్‌తో హైప్ పీక్స్‌లోకి.. ధనుష్ మూవీలో మూడు బిగ్ సర్‌ప్రైజ్‌లు!
సౌత్ స్టార్ హీరో ధనుష్ తన కొత్త సినిమా ఓం చాప్టర్1: ఉధిరమ్ ది బ్లడ్ వుడ్ అనౌన్స్‌మెంట్ తో ఒక్కసారిగా సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 9 July 2026 4:52 PM ISTసౌత్ స్టార్ హీరో ధనుష్ తన కొత్త సినిమా ఓం చాప్టర్1: ఉధిరమ్ ది బ్లడ్ వుడ్ అనౌన్స్‌మెంట్ తో ఒక్కసారిగా సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచేశారు. ఫ్యాన్స్ ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో, తాను ప్రస్తుతం చేస్తున్న కొత్త ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్‌ను అనౌన్స్ చేయడం సర్‌ప్రైజ్‌గా మారింది. అయితే ఈ అనౌన్స్‌మెంట్ లో కేవలం సినిమా పేరు మాత్రమే కాదు, స్టార్‌కాస్ట్, బాలీవుడ్ దిగ్గజ ఎంట్రీ, టైటిల్‌లో దాగి ఉన్న సంకేతాలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సినిమా ధనుష్ కెరీర్‌లో 55వ సినిమాగా రూపొందుతోంది. డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. నేషనల్ అవార్డులు అందుకున్న ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనిపించబోతుండటంతో ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయి? ఒకరితో ఒకరు పోటీ పడేలా కనిపిస్తారా? లేక కథను ముందుకు నడిపే కీలక పాత్రల్లో ఉంటారా? అనే డిస్కషన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో మొదలయ్యాయి. సాయి పల్లవి, శ్రీలీల కూడా నటిస్తుండటంతో ఈ సినిమా నిజమైన పాన్ ఇండియా మల్టీస్టారర్‌గా రూపుదిద్దుకుంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే ఈ అనౌన్స్‌మెంట్ లో అత్యంత ఆసక్తికరమైన అంశం బాలీవుడ్ దిగ్గజ నటుడు నసీరుద్దీన్ షా ఎంట్రీ. దాదాపు 26 ఏళ్ల తర్వాత ఆయన కోలీవుడ్ సినిమాలో నటించబోతుండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. గతంలో తమిళ ఆడియన్స్ ను మెప్పించిన ఆయన, ఇప్పుడు మళ్లీ ఈ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం నాస్టాల్జియా ఫ్యాక్టర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే మేకర్స్ ఆయన సెట్స్‌లో చేరినట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో, సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ మరింత పెరిగింది. కథలో కీలక మలుపు తిప్పే పాత్రనా? లేక ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించనున్నారా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు సినిమా టైటిల్ కూడా ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. టైటిల్ లో చాప్టర్1 అని ఉండటంతో ఇది కేవలం ఒకే సినిమాతో ముగిసే కథ కాదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఇండియన్ సినీ హిస్టరీలో ఫ్రాంచైజీలు, సినిమాటిక్ యూనివర్స్‌లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ధనుష్ కూడా దీర్ఘకాలిక ఫ్రాంచైజీకి శ్రీకారం చుడుతున్నారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకపోయినా, టైటిల్ మాత్రం సీక్వెల్స్ లేదా యూనివర్స్‌కు బలమైన సంకేతంగా కనిపిస్తోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. గోపురం ఫిలిమ్స్ బ్యానర్‌పై అన్బుచెళియన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
