Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తా: ధనుష్

అయితే మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించగా.. ధనుష్ కూడా అటెండ్ అయ్యారు.

By:  Tupaki Desk   |   16 Jun 2025 9:41 AM IST
పవన్ కళ్యాణ్ తో మూవీ చేస్తా: ధనుష్
X

కోలీవుడ్ ప్రముఖ నటుడు ధనుష్.. అటు హీరోగా.. ఇటు డైరెక్టర్ గా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన.. ఇప్పుడు మరిన్ని మూవీలను లైన్ లో పెడుతున్నారు. డైరెక్టర్ గా వరుస చిత్రాలు తెరకెక్కిస్తూ సందడి చేస్తున్నారు. అదే సమయంలో హీరోగా కూడా నటిస్తూనే ఉన్నారు.

ఇప్పుడు కుబేర మూవీతో మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో లీడ్ రోల్ పోషించారు. బిచ్చగాడిగా కనిపించనున్నారు. ఆయనతో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, ఫేమస్ యాక్టర్ జిమ్ సర్బ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా హైదరాబాద్ లో నిర్వహించగా.. ధనుష్ కూడా అటెండ్ అయ్యారు. ఎప్పటిలాగే డీసెంట్ లుక్ లో సందడి చేశారు. ఆ సమయంలో యాంకర్ సుమ.. ధనుష్ తో సరదాగా ముచ్చటించారు. కాసేపు చిట్ చాట్ నిర్వహించారు. అందుకు సంబంధించిన వీడియో ఫుల్ వైరల్ అవుతోంది.

చిట్ చాట్ లో భాగంగా సుమ.. తమిళంలో మీరు కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు కదా.. మరి తెలుగులో ఏ హీరోతో మూవీ చేయాలనుకుంటున్నారని ధనుష్ అని అడిగారు. వెంటనే ఆయన.. పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దీంతో ఒక్కసారిగా ఈవెంట్ జరిగిన ప్రాంతమంతా చప్పట్లు, ఈలలతో మారు మోగిపోయి దద్దరిల్లింది.

ధనుష్ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది. అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంతకుముందు ఓ సారి పవన్ గురించి ధనుష్ గొప్పగా మాట్లాడారు. తాను ఎప్పుడూ ఆయనను ఆరాధిస్తానని తెలిపారు. సినిమాల పరంగానే కాదని.. బయట కూడా అని తెలిపారు. ఇప్పుడు పవన్ మూవీకి దర్శకత్వం వహించాలని ఉందని చెప్పారు.

మొత్తానికి తన మనసులోని మాటను బయటపెట్టగా.. పవన్, ధనుష్ కాంబో సెట్స్ పైకి వెళ్తే ఎంత బాగుంటుందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. ధనుష్ కామెంట్ తర్వాత కచ్చితంగా పవన్ తో మూవీ ఓకే అయితే వేరే లెవెల్ అని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం తన లైనప్ లో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్న పవర్ స్టార్.. కొత్త మూవీలు ఓకే చేస్తారో లేదో ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి ధనుష్ కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.