Begin typing your search above and press return to search.

స్టార్‌ హీరో.. చేతిలో ఆరు!

ఒకప్పుడు స్టార్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో పాటు ఇతర చిన్న హీరోలు, మీడియం రేంజ్‌ హీరోలు ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసే వారు, రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున విడుదల చేసేవారు అని వింటూ ఉంటాం.

By:  Tupaki Desk   |   12 April 2025 8:00 PM IST
Dhanushs Back-to-Back Films Storm Kollywood
X

ఒకప్పుడు స్టార్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో పాటు ఇతర చిన్న హీరోలు, మీడియం రేంజ్‌ హీరోలు ఏడాదికి పదికి పైగా సినిమాలు చేసే వారు, రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున విడుదల చేసేవారు అని వింటూ ఉంటాం. ప్రస్తుత పరిస్థితుల్లో ఏడాదికి ఒక్కటి కూడా విడుదల చేసే పరిస్థితి లేదు అంటారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అయిన మహేష్‌ బాబు, ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, బన్నీ, ప్రభాస్ వంటి వారు ఏడాదికి కనీసం ఒక్కటి కూడా విడుదల చేయలేక పోతున్నారు. కొందరు హీరోలు ఏడాదిలో రెండు సినిమాలు విడుదల చేయాలని బలంగా కోరుకుంటున్నామని చెబుతూ ఉన్నప్పటికీ అది మాత్రం ఆచరణ సాధ్యం కాదని చెప్పాలి.

బాలీవుడ్‌లో హీరోలు కొందరు ఏడాదికి ఒకటి, రెండు క్రమం తప్పకుండా సినిమాలు చేస్తున్నారు. తమిళ్‌ సినిమా ఇండస్ట్రీలోనూ అదే పరిస్థితి నెలకొంది. కానీ ప్రతి ఇండస్ట్రీలోనూ ఒకరు ఇద్దరు హీరోలు ఏడాదికి రెండు మూడు సినిమాలతో వస్తున్నారు. తమిళ్ స్టార్‌ హీరో ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూనే ఉన్నాడు. గత ఏడాది ధనుష్ నటించిన సినిమాలు రెండు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అంతకు ముందు ఏడాది రెండు సినిమాలతో ధనుష్ వచ్చాడు. 2022లో ధనుష్‌ ఏకంగా నాలుగు ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ ఏడాది ధనుష్ నటించిన సినిమాలు నాలుగు అయిదు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ధనుష్ దర్శకత్వంలో రూపొందిన 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సమ్మర్‌లోనే 'కుబేరా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు దర్శకుడు శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున కీలక పాత్రలో నటించిన కుబేరా సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. కుబేరా విడుదలైన వెంటనే స్వీయ దర్శకత్వంలో ధనుష్ రూపొందిస్తున్న 'ఇడ్లీ కడై' సినిమా రాబోతుంది. ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్‌ విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత ధనుష్ నటిస్తున్న హిందీ మూవీ విడుదలకు రెడీగా ఉంది.

గతంలో హిందీ సినిమాల్లో నటించి మెప్పించిన ధనుష్ మరోసారి బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు తేరే ఇస్క్‌ మైన్‌ సినిమాతో వెళ్లనున్నాడు. ఇన్ని సినిమాలు లైన్‌లో ఉండగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ మరో సినిమాను కమిట్‌ అయ్యాడు. ఆ సినిమా కథ నచ్చడంతో వచ్చే ఏడాదిలో సినిమాను చేసేందుకు ధనుష్ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడని తెలుస్తోంది. ధనుష్‌, శేఖర్‌ కమ్ముల సినిమాలు బ్యాక్‌ టు బ్యాక్ రాబోతున్నాయి. ఇటీవలే మారి సెల్వరాజ్‌ దర్శకత్వంలో ధనుష్ తన 56వ సినిమాను ప్రకటించాడు. కత్తికి పుర్రె బొమ్మ ఉండటంతో హర్రర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇవి కాకుండా ఇడ్లీ కడై తర్వాత తన దర్శకత్వంలో మరో సినిమాను బయటి హీరోతో చేయబోతున్నాడు. మొత్తంగా ధనుష్‌ చేతిలో ప్రస్తుతం ఆరు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. రాబోయే ఏడాది కాలంలోనే ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.