ధనుష్ మాట్లాడింది ఆమె గురించేనా?
తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కుబేర. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా, కుబేర జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Tupaki Desk | 2 Jun 2025 10:00 PM ISTతమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా కుబేర. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా, కుబేర జూన్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా చెన్నైలో ఆడియో లాంచ్ ను నిర్వహించింది.
ఈ ఆడియో లాంచ్ లో భాగంగా ధనుష్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు నా గురించి ఎన్ని రూమర్లు చెప్పినా, నన్ను ఎంత వివాదాల్లోకి లాగినా దాని వల్ల నాకేం నష్టముండదని, నా వెంట నాకు తోడుగా నా ఫ్యాన్స్ ఉన్నారని ఓపెన్ గా చెప్పాడు. దీంతో ధనుష్ ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడాడని ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
ధనుష్ మాట్లాడిన స్పీచ్ ను పలుమార్లు విని, అన్ని విషయాలనూ ఆలోచించి కొంతమంది నెటిజన్లు ధనుష్ మాట్లాడింది నయనతార గురించే అని రెస్పాండ్ అవడం మొదలుపెట్టారు. ధనుష్ కొత్త సినిమాల రిలీజ్ టైమ్ లో అనవసర వ్యాఖ్యలను చేసి నయనతారే ఎప్పుడూ ఏదొక వివాదాన్ని సృష్టిస్తూ, ధనుష్ పేరును వివాదాల్లోకి తీసుకొస్తుందని అంటున్నారు.
మరికొందరు మాత్రం ధనుష్ ఇన్‌డైరెక్ట్ గా ఎటాక్ చేసింది సింగర్ సుచిత్రనే అని, ఆయన సినిమా రిలీజవుతున్నప్పుడు ధనుష్ గురించి పుకార్లను పుట్టించి ప్రచారం చేయిస్తూ ఉండేది ఆమేనని అంచనా వేస్తున్నారు. ధనుష్ తన స్పీచ్ లో భాగంగా ఎవరి పేర్లనూ ప్రస్తావించకపోవడం వల్ల ఇప్పుడు నెటిజన్లు ఇలా ఇష్టమొచ్చిన పేర్లను అంచనా వేస్తున్నారు. మొత్తానికి ధనుష్ స్పీచ్ తో కుబేరకు కావాల్సినంత హైప్ అయితే వచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని చిత్ర యూనిట్ మొత్తం ఎంతో కాన్ఫిడెంట్ గా ఉంది.
